ఈ సారి…’బాటిల్’తో మొదలు పెట్టాడా??

రామ్ గోపాల్ వర్మ…టాలీవుడ్ లో గ్యాంగ్ స్టార్స్ కధలతో కూడుకున్న కధలను మొదలు పెట్టింది ఎవరు అంటే ఒకరకంగా మన వర్మ అనే చెప్పాలి. అయితే అలాంటి వర్మ ఒకప్పుడు ఇండస్ట్రీని  సూపర్ హిట్ సినిమాలతో శాసించాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు తలపోటు అక్కడే మొదలయింది. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్ జరిగితే అక్కడకు వెళ్ళి వాలిపోవడడం. దానిపై సినిమా తీసేసి, పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్ళి..చివరకు నీరుగార్చడం అలవాటుగా మారిపోయింది. ఇదిలా ఉంటే సినిమాల పేరుతో ఏదో తనకు నచ్చింది తీస్తున్నాడు ఇష్టం ఉంటే చూస్తాం లేకపోతే లేదు అనుకోండీ ఆది వేరే విషయం.

కానీ వర్మ ట్విటర్ వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు…..తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ…శెటైర్స్ వేస్తూ…ఇంకా చెప్పాలి అంటే ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటాడు…విషయం ఏమిటంటే…రీసెంట్ గా టీచర్స్ తో వివాదంలో ఫిలడెల్ఫియా పాఠాలు అంటూ.. అమ్మాయి ప్యాంటీకి వెనుక వైపు అక్షరాలు రాసి ఉన్న ఫోటోను షేర్ చేసి రచ్చ..రచ్చ చేసిన విషయం మరచిపోకముందే….తాజాగా…కిమ్ కర్దాషియన్ ఫోటో ఒకటి పెట్టి.. ఆమెపై ఎవరికీ పేటెంట్ తీసుకోకుండా ఉండాలి అని రచ్చ మొదలు పెట్టాడు. ‘ఈ స్మార్ట్ బాటిల్ కి ప్రపంచంలోనే బెస్ట్ షేప్ ఉంది. దీనిపై ఏ కంపెనీకి పేటెంట్/పెళ్లి దక్కదని.. ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేయగా.. ఓ బాటిల్ ని చేతిలో పట్టుకుని ఫుల్ బ్లాక్ డ్రస్ లో నడిచొస్తున్న కిమ్ మనకు కనిపిస్తుంది. వర్మ మాటలు అయితే బాటల్ గురించి కానీ…అసలు మ్యాటర్ అదే వర్మ చెప్పిన పేటెంట్ కిమ్ కర్దాషియాన్ గురించే అని అర్ధమవుతూనే ఉంది. ఏది ఏమైనా…వర్మ తనకు ఎలా నచ్చితే అలా మాట్లాడుతూ మిడ్ నైట్స్ హల్‌చల్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus