ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాల వాయిదా..!

  • October 28, 2017 / 08:17 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అనేక విజయాలను అందించింది. అందుకే ప్రతి శుక్రవారం తప్పకుండా రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం(oct 27) కూడా మూడు విడుదలవడానికి సిద్ధమయ్యాయి. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ వాటిలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన “ఉన్నది ఒకటే జిందగీ” మాత్రమే థియేటర్లోకి వచ్చింది. గోపీచంద్ ఆశలుపెట్టుకున్న “ఆక్షిజన్”, తమిళంలో సంచలనం సృష్టిస్తున్న మెర్సల్ మూవీకి డబ్బింగ్ “అదిరింది” సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఈ అంశం అభిమానులను నిరాశపరిచినా..  రామ్ సినిమాకు మాత్రం ప్రయోజనం కల్పించింది. ఆక్సిజన్, అదిరింది సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఇంకా ప్రకటించలేదు.

వచ్చే వారానికి రాజశేఖర్ “గరుడవేగ”, ఆది ‘”నెక్స్ట్ నువ్వే”, హెబ్బా పటేల్ “ఏంజెల్” సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. అయినప్పటికీ వచ్చే వారమే అదిరింది, ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ఆస్కారం ఉందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. ఎందుకంటే స్టార్ హీరోలు సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్స్ సమస్య ఉండదని చెప్పారు. ఒక రోజు ముందు తర్వాత పద్ధతిన ఈ ఐదు సినిమాలు వచ్చే వారం థియేటర్లలో సందడి చేస్తుందని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus