Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 2, 2020 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొంది.. రెండేళ్లపాటు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ల్యాబ్ లోనే మూలిగి.. గత నెల తమిళంలో విడుదలై మిక్స్డ్ రివ్యూలు అందుకున్న ఈ చిత్రం ఇవాళ తెలుగులో విడుదలైంది. మరి ఈ తూటా సరైన విధంగా వర్కవుట్ అయ్యిందో లేదో చూద్దాం..!!

Thoota Movie Review Telugu1

కథ: రఘు (ధనుష్) తాను కాలేజ్ టైమ్ లో ప్రేమించిన లేఖ (మేఘా ఆకాష్) ముంబైలో ఆపదలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి.. ఒక గ్యాంగ్ ఫైట్ లో ఇరుక్కుంటాడు.

అసలు లేఖ ముంబైలో ఎందుకు ఉంది? రఘు గ్యాంగ్ ఫైట్ లో ఎందుకు ఇరుక్కున్నాడు? లేఖను కాపాడగలిగాడా? అనేది “తూటా” కథాంశం.

Thoota Movie Review Telugu2

నటీనటుల పనితీరు: నటుడిగా ధనుష్ పనితనం గురించి చర్చించుకోవాల్సిన స్థాయిని అతడు ఎప్పుడో దాటేశాడు. తాను పోషించే పాత్రకు ప్రాణం పోయడమే ధ్యేయంగా నటిస్తున్నాడు ధనుష్. ఈ చిత్రంలోనూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రఘు క్యారెక్టర్ లో చాలా ఈజీగా ఇమిడిపోయాడు.

మేఘా ఆకాష్ అందంగా కనిపించడమే కాక అభినయంతోనూ ఆకట్టుకొంది. శశికుమార్, సెంథిల్ వీరస్వామి పాత్రలు అలరిస్తాయి. గెస్ట్ రోల్లో రాణా, స్నేహితురాలి పాత్రలో సునైన పాత్రలు ఆకట్టుకుంటాయి.

Thoota Movie Review Telugu3

సాంకేతికవర్గం పనితీరు: గౌతమ్ మీనన్ చెప్పిందేమీ కొత్త కథ కాదు.. కొత్తగానూ చెప్పలేదు. ఈ రెండు సినిమాకి మైనస్ పాయింట్సే. అయితే.. ఈ రెండిటికంటే పెద్ద మైనస్ సినిమాలో ప్రతి అయిదు నిమిషాలకి వచ్చే వాయిస్ ఓవర్. సన్నివేశాన్ని ప్రేక్షకుడు అర్ధం చేసుకోవడానికి లేదా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకొనేలోపు ఇమ్మీడియట్ గా వచ్చే వాయిస్ ఓవర్ పెద్ద మైనస్. “సూర్య సన్నాఫ్ కృష్ణమూర్తి” సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వాయిస్ ఓవర్ “తూటా” చిత్రానికి మైనస్ గా మారడానికి కారణం కథనం.

పేరలల్ స్క్రీన్ ప్లేగా సాగే ఈ కథనంలో క్లారిటీ కూడా కొరవడుతుంది. భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందర్నీ ఒక విశేషమైన రీతిలో ఆకట్టుకున్న “మరువాలి” పాట చిత్రీకరణ బిగ్గెస్ట్ డిజప్పాయింట్మెంట్. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ టాప్ క్లాస్ గా ఉన్నప్పటికీ.. మూస కథ, సాగతీత కథనం కారణంగా “తూటా” బోర్ కొట్టిస్తుంది.

Thoota Movie Review Telugu4

విశ్లేషణ: ధనుష్ పెర్ఫార్మెన్స్ కోసమే సినిమా చూడాల్సిన అవసరం ప్రేక్షకుడికి ఇంకా ఏర్పడలేదు. నటుడి అభినయం ఆకట్టుకోవాలంటే అలరించే కథనం కూడా ఉండాలి. గౌతమ్ మీనన్ స్క్రీన్ ప్లేలో ఈసారి ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. దాంతో ఈ తూటా తేలిపోయింది.

Thoota Movie Review Telugu5

రేటింగ్: 1.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Gautham Vasudev Menon
  • #megha akash
  • #Thoota Movie
  • #Vijayabherivari

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version