రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీపై ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఆంధ్ర ఏరియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. దసరాకు విడుదలవుతున్న ఇతర సినిమాలకు టైగర్ నాగేశ్వరరావు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంది. రవితేజ మూవీ హక్కులకు రికార్డ్ రేట్ పలుకుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
పశ్చిమ గోదావరికి చెందిన ఉష బాలకృష్ణ ఈ సినిమా ఆంధ్ర ఏరియా హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నైజాం ఏరియాలో మాత్రం నిర్మాతలు ఈ సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా ఈ సినిమాతో (Tiger Nageswara Rao) మాస్ మహారాజ్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.
రవితేజ పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది. రవితేజ సినిమాలు హిందీలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇతర భాషల్లో కూడా రవితేజ సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రవితేజ రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇతర హీరోలకు భిన్నంగా మాస్ మహారాజ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రవితేజ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మాస్ మహారాజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటి నుపూర్ సనన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్