3 ఏళ్ల లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనంతరం విడిపోయిన స్టార్ లవర్స్

అతడు తండ్రి ఇమేజ్ ను బేస్ చేసుకొని హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకొన్న హీరో. ఆమె ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్ మరియు గ్లామర్ ను నమ్ముకొని ఎదిగిన హీరోయిన్. ఈ ఇద్దరూ కలిసి యాక్ట్ చేసింది ఒక వీడియో సాంగ్ కోసం మాత్రమే.. కానీ నాలుగైదు సినిమాల్లో కలిసి యాక్ట్ చేసినంత కెమిస్ట్రీని ఆ ఒక్క పాటలోనే ఒలకబోశారు. అందుకే.. కలిసి నటించకుండానే హాటెస్ట్ పెయిర్ అయిపోయారు. వాళ్ళే బాలీవుడ్ కొత్త కండల వీరుడు టైగర్ ష్రాఫ్ మరియు బోల్డ్ బ్యూటీ దిశా పటానీ. ఈ ఇద్దరూ గత మూడేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

వీళ్ళు త్వరలోనే పెళ్లి కూడా చేసుకొంటారు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న తరుణంలో.. వీళ్ళు విడిపోయారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దిశా ఆల్రెడీ వేరే స్టార్ సెలబ్రిటీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోందని.. ఈ విషయం తెలిసిన టైగర్ బాబు సైలెంట్ గా సైడ్ అయిపోయాడని తెలుస్తోంది. త్వరలోనే వాళ్ళ బ్రేకప్ గురించి అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus