Tillu Square: బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు స్క్వేర్.. టిల్లూ3 అలా ఉండబోతుందా?
March 30, 2024 / 06:10 PM IST
|Follow Us
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నేహాశెట్టి (Neha Shetty) కాంబినేషన్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా అదరగొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 23.5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ మొత్తం గ్రాస్ కలెక్షన్లు కాగా కలెక్షన్ల పరంగా ఈ మొత్తం తక్కువ మొత్తం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు, రేపు బుకింగ్స్ విషయంలో సైతం ఈ సినిమా అదరగొడుతోంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ కావడంతో సోమవారం రోజున టిల్లూ3 ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
టిల్లూ స్క్వేర్ మంచి లాభాలను అందించడం ఖాయమని టిల్లూ3 సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టిల్లూ3 మూవీ ఎప్పుడు విడుదలైనా భారీ హిట్టవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత వేగంగా తెరకెక్కించి వేగంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. టిల్లూ స్క్వేర్ కలెక్షన్ల విషయంలో అదరగొడుతూ ఉండటంతో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను సులువుగానే అందుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. టిల్లూ స్క్వేర్ మూవీ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టిల్లూ స్క్వేర్ సినిమాకు సిద్ధూ కామెడీ టైమింగ్, అనుపమ పాత్ర ట్విస్ట్ లు హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు.
టిల్లూ స్క్వేర్ సినిమా యూత్ ను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. నైజాం ఏరియాలో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టిల్లూ స్క్వేర్ మూవీ సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ మరింత పెరిగింది.