Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ‘హంట్’ టైటిల్ మాది.. ఎంత దర్జాగా దొబ్బేసారో : యువ హీరో

‘హంట్’ టైటిల్ మాది.. ఎంత దర్జాగా దొబ్బేసారో : యువ హీరో

  • October 18, 2022 / 12:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హంట్’ టైటిల్ మాది.. ఎంత దర్జాగా దొబ్బేసారో : యువ హీరో

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో ‘హంట్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా ‘హంట్’ రూపొందినట్లు మేకర్స్ తెలియజేశారు. ఇదిలా ఉండగా.. ‘హంట్’ అనే టైటిల్ మాదే అంటూ మరో చిన్న సినిమా యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ‘శ్రీ క్రియేషన్స్’ పతాకం పై నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా… నర్సింగ్ రావు నిర్మాతగా ‘హంట్’ పేరుతోనే మరో సినిమా రూపొందుతుంది.

తాజాగా మోషన్ టీజర్ ను కూడా విడుదల చేశారు. అయితే ‘హంట్’ పేరుతో సుధీర్ బాబు చిత్రం విడుదల కాబోతుంది కదా అనే ప్రశ్న ఎదురవ్వగా అందుకు చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. “మేము ‘హంట్’ చిత్రం మోషన్ టీజర్ ను విడుదల చేశాం.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.’హంట్’ అనే టైటిల్ ను మేము 6 నెలల క్రితమే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాము. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో ‘భవ్య క్రియేషన్స్’ వాళ్ళు సుధీర్ బాబుతో ఓ సినిమా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేశారు. కానీ మా ‘శ్రీ క్రియేషన్స్’ బ్యానర్ పైనే ఫిలిం చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్చే యించుకున్నాం.

ఆల్రెడీ మేము రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ను మీ సినిమాకి ఎలా పెట్టుకుంటారు? ఈ విషయమై ఫిలిం ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశాం. చాంబర్ వాళ్ళు కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళ తో మాట్లాడారు కానీ మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు 21 రోజుల వ్యవధిలో వేరే చిత్రానికి ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యిందా? లేదా? అని చెక్ చేసి మరి టైటిల్ ని రిజిస్టర్ చేస్తారు. మరి మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు ఎలా ‘హంట్’ టైటిల్ ని వాడతారు అని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం కావాలి” అంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఈ చిత్రం హీరో, డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ “ఒక సినిమా టైటిల్ ని చాలా రాయల్ గా దొంగిలించారు. 2,3 నెలల నుంచి భవ్య క్రియేషన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, హంట్ టైటిల్ మేము రిజిస్టర్ చేసుకున్నాము, మీరు టైటిల్ మార్చుకోండి అని. వాళ్ళు పటించుకోవడం లేదు. చాంబర్ లో కూడా కంప్లైంట్ చేసాం కానీ మాకు న్యాయం దొరకడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే నిర్మాత నర్సింగ్ రావు మాట్లాడుతూ.. “మేము మా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ‘హంట్’ టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నాం. షూటింగ్ కూడా జరుపుకుంటున్నాం. సడన్ గా ఒకరోజు ‘హంట్’ టైటిల్ తో సుధీర్ బాబు గారి పోస్టర్ కనిపించింది.

వెంటనే భవ్య క్రియేషన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం. కానీ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేసాము. కానీ ఫలితం లేదు. చాంబర్ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. మా చిత్ర ఆడియో రైట్ అమ్మటానికి ప్రయత్నం చేసాం కానీ హంట్ పేరు తో వేరే చిత్రం ఉంది మేము మీ చిత్రం కొనలేము అంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. మాకు న్యాయం కావాలి” అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. మరి చివరికి సుధీర్ బాబు సినిమా టీం… టైటిల్ మార్చుకుంటారా? లేదా? అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath Niwas
  • #Hunt
  • #Mahesh Surapaneni
  • #Srikanth Meka
  • #Sudheer Babu

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

5 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

5 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

7 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

12 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

1 day ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version