సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’.ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. ‘శ్రీదేవి మూవీస్’ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో సమంత నిండు గర్భిణిగా కనిపిస్తుంది. మొదట మూడో నెల అంటూ డాక్టర్ చెప్పడం.. ఆ తర్వాత నెలలు పెరిగే కొద్దీ ఆమె ఎదుర్కొన్న ప్రమాదాలను ఈ టీజర్ ద్వారా రెప్ప వేయాలనే ఆలోచన రాకుండా చూపించారు. ఇలాంటి పాత్రలు పోషించడం అంటే మాటలు కాదు. హీరోయిన్లలో యాక్టింగ్ స్కోప్ ఎంత ఉందో తెలియజేసేవి ఇలాంటి పాత్రలే..! నిజానికి ఇలాంటి పాత్రలు చేయడానికి కూడా హీరోయిన్లు ఇష్టపడరు. గ్లామర్ షో ను పక్కన పెట్టి.. ఎమోషన్ పండించాల్సిన పాత్రలు ఇవి. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు ఇలాంటి పాత్రలు అద్భుతంగా పోషించి ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సౌందర్య :

‘9 నెలలు’ చిత్రంలో సౌందర్య గర్భిణిగా కనిపిస్తుంది. తన భర్తను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె సరోగసి పద్ధతి ద్వారా గర్భిణి గా మారినట్టు చూపిస్తారు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ 2001 టైంకి ఇదొక మంచి కాన్సెప్ట్ మూవీ అనిపించుకుంది. సౌందర్య నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

2) అనుష్క శెట్టి :

‘బాహుబలి 2’ లో ఈమె నిండు గర్భిణిగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంటుంది.

3) కీర్తి సురేష్ :

‘రంగ్ దే’, ‘పెంగ్విన్’ చిత్రాల్లో కీర్తి సురేష్ గర్భవతిగా చాలా చక్కగా నటించింది.

4) సాయి పల్లవి :

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన ‘పావ కథాగల్’ చిత్రంలో గర్భవతిగా చాలా చక్కగా నటించింది సాయి పల్లవి.

5) నిత్యా మీనన్ :

విజయ్ ‘మెర్సల్'(తెలుగులో అదిరింది) మూవీలో గర్భవతి పాత్రలో మంచి నటన కనపరిచింది.

6) విద్యా బాలన్ :

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విద్యాబాలన్.. ‘కహానీ’ చిత్రంలో గర్భవతిగా చాలా చక్కగా నటించింది.

7) కృతి సనన్ :

‘1 నేనొక్కడినే’ ‘దోచేయ్’ వంటి చిత్రాల్లో నటించి ఇప్పుడు ప్రభాస్ తో ‘ఆది పురుష్’ లో నటిస్తున్న కృతి సనన్… ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించి అలరించింది.

8) కియారా అద్వానీ :

‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ ‘గుడ్ న్యూస్’ మూవీలో గర్భవతిగా నటించి అలరించింది.

9) ప్రియాంక చోప్రా :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘తుఫాన్’ (జంజీర్) తెలుగు సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈమె కూడా ‘మేరీ కోమ్’ అనే చిత్రంలో ప్రెగ్నెంట్ గా నటించింది.

10) అనసూయ :

‘థాంక్యూ బ్రదర్’ అనే చిత్రంలో గర్భవతిగా నటించింది అనసూయ.

11) సమంత :

‘యశోద’ మూవీలో గర్భవతిగా కనిపించనుంది.

12) కీర్తి రెడ్డి :

పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి కూడా.. మహేష్ బాబు ‘అర్జున్’ సినిమాలో గర్భవతిగా కనిపించింది.

13) స్నేహ :

‘అమరావతి’ చిత్రంలో గర్భవతి పాత్ర పోషించి ఆకట్టుకుంది స్నేహ.

 

Share.