Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కోపంతో మెప్పించిన తెలుగు హీరోలు

కోపంతో మెప్పించిన తెలుగు హీరోలు

  • May 4, 2018 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోపంతో మెప్పించిన తెలుగు హీరోలు

హీరో అంటే నవరసాలు పలికించాలి. మన హీరోలు తమ నటనతో నవ్వించారు. ప్రేమ కురిపించారు. ఏడిపించారు. అలాగే ఈ మధ్య తమ కోపంతోను మెప్పిస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం ఆవేశంతో రగిలిపోయే పాత్రలు.. వాటిని అద్భుతంగా పోషించిన వారిపై ఫోకస్..

1. అల్లు అర్జున్ (నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా) Naa Peru Suryaనా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో అల్లు అర్జున్ కోపం ఎక్కువగా ఉండే ఆర్మ్ ఆఫీసర్ గా నటించారు. తాజాగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలో బన్నీ నటనకు ఫాన్స్ విజిల్స్ వేస్తున్నారు.

2. విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)Arjun Reddyడాక్టర్స్ అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కానీ అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ ఆవేశం నిండిన వైద్యుడిగా కనిపించి సంచలనం సృష్టించారు.

3. మోహన్ బాబు (రాయలసీమ రామన్న చౌదరి) Rayalaseema Ramanna Chowdaryడైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎక్కువగా సీరియస్ పాత్రలు పోషించారు. అయితే రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో మాత్రం అందరూ భయపడేలా కోపాన్ని ప్రదర్శించారు.

4. సాయి కుమార్ (పోలీస్ స్టోరీ)Police Story పోలీసులు ఎక్కువమంది ఎక్కువ సార్లు చూసిన సినిమాల జాబితాలో పోలీస్ స్టోరీ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో సాయి కుమార్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.

5. రాజశేఖర్ (అంకుశం, ఆగ్రహం) Ankusam , Agrahamరాజశేఖర్ కి యాంగ్రీ హీరోగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు అంకుశం, ఆగ్రహం. ఇందులో రాజశేఖర్ నటనకు చాల మంది అభిమానులు అయిపోయారు.

6. బాలకృష్ణ (చెన్న కేశవ రెడ్డి)Chennakesavareddyఫ్యాక్షన్ కథలో వీరం, రౌద్రం పలికించడంలో బాలయ్యకి తిరుగులేదు. అయితే చెన్న కేశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ ఆవేశంతో కూడిన నటన ఔరా అనిపించింది.

7. జగపతి బాబు (గాయం, లెజెండ్) Gayam, Legendహీరోగా జగపతి బాబు గాయం సినిమాలో కోపాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. జగపతి బాబు విలన్ గా అవతారమెత్తి హీరోని సైతం భయపెట్టారు. లెజెండ్ చిత్రంలో బాలయ్యకి ఎదురు నిలిచి అందరి మనసులు గెలిచారు.

8. ఎన్టీఆర్ (జై లవ కుశ, టెంపర్) Jai Lava Kusa, Temperఆది సినిమాలో పగతో రగిలిపోయే తారక్ ని మనం చూశాం. టెంపర్ లో పూర్తి స్థాయిలో ఆవేశపరుడిగా మెప్పించారు. జై లవకుశలోను జై పాత్ర కోపంతో రగిలిపోతుంటుంది. అయినా అతని నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.

9. ప్రభాస్ (రాఘవేంద్ర) raghavendraకెరీర్ కొత్తల్లో ప్రభాస్ షార్ట్ టెంపర్ యువకుడిగా రాఘవేంద్ర సినిమాలో నటించారు. అప్పుడే తన నటనతో అభిమానులతో చప్పట్లు అందుకున్నారు.

10. నాగార్జున (రక్షకుడు)rakshakuduతనకి ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పు చేసిన వాడి అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ కొట్టే పాత్రను రక్షకుడు చిత్రంలో నాగార్జున పోషించారు. అందమైన పాత్రల్లో కనిపించే నాగ్ ఆవేశపరుడిగా ఇందులో కొత్తగా చూశాం.

11 . వెంకటేష్ (ధర్మ చక్రం, గణేష్)dharmachakram, Ganeshవిక్టరీ వెంకటేష్ చాలా సరదా పాత్రలు పోషిస్తుంటారు. చిన్నపిల్లలకు సైతం అతనంటే ఇష్టపడుతారు. అటువంటి వెంకీ.. ధర్మ చక్రం, గణేష్ సినిమాల్లో ఆవేశపరుడిగా అల్లాడించారు.

12 . విక్రమ్ ( శివ పుత్రుడు)shivaputruduవిలక్షణ పాత్రలతో మెప్పించిన విక్రమ్ శివపుత్రుడు సినిమాలో ఆవేశాన్ని విభిన్నంగా ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

13 . దుల్కర్ సల్మాన్ (హే పిల్లగాడా)Hey Pillagaadaమలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హే పిల్లగాడా సినిమాలో కోపంగా నటించి తెలుగువారి గుండెల్లో స్థానం అందుకున్నారు.

ఏ పాత్రలో నటించారని కాదు.. ఎంత బాగా నటించారనేది తెలుగు ప్రేక్షకులు చూస్తారని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలోకి వచ్చే ఏదైనా సినిమాను మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agraham
  • #Ankusam
  • #Arjun Reddy
  • #Chennakesava Reddy
  • #Dharmachakram

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

10 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

11 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

12 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

14 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

15 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version