కోపంతో మెప్పించిన తెలుగు హీరోలు

హీరో అంటే నవరసాలు పలికించాలి. మన హీరోలు తమ నటనతో నవ్వించారు. ప్రేమ కురిపించారు. ఏడిపించారు. అలాగే ఈ మధ్య తమ కోపంతోను మెప్పిస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం ఆవేశంతో రగిలిపోయే పాత్రలు.. వాటిని అద్భుతంగా పోషించిన వారిపై ఫోకస్..

1. అల్లు అర్జున్ (నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో అల్లు అర్జున్ కోపం ఎక్కువగా ఉండే ఆర్మ్ ఆఫీసర్ గా నటించారు. తాజాగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలో బన్నీ నటనకు ఫాన్స్ విజిల్స్ వేస్తున్నారు.

2. విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)డాక్టర్స్ అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కానీ అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ ఆవేశం నిండిన వైద్యుడిగా కనిపించి సంచలనం సృష్టించారు.

3. మోహన్ బాబు (రాయలసీమ రామన్న చౌదరి) డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎక్కువగా సీరియస్ పాత్రలు పోషించారు. అయితే రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో మాత్రం అందరూ భయపడేలా కోపాన్ని ప్రదర్శించారు.

4. సాయి కుమార్ (పోలీస్ స్టోరీ) పోలీసులు ఎక్కువమంది ఎక్కువ సార్లు చూసిన సినిమాల జాబితాలో పోలీస్ స్టోరీ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో సాయి కుమార్ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.

5. రాజశేఖర్ (అంకుశం, ఆగ్రహం) రాజశేఖర్ కి యాంగ్రీ హీరోగా పేరు తెచ్చిపెట్టిన సినిమాలు అంకుశం, ఆగ్రహం. ఇందులో రాజశేఖర్ నటనకు చాల మంది అభిమానులు అయిపోయారు.

6. బాలకృష్ణ (చెన్న కేశవ రెడ్డి)ఫ్యాక్షన్ కథలో వీరం, రౌద్రం పలికించడంలో బాలయ్యకి తిరుగులేదు. అయితే చెన్న కేశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ ఆవేశంతో కూడిన నటన ఔరా అనిపించింది.

7. జగపతి బాబు (గాయం, లెజెండ్) హీరోగా జగపతి బాబు గాయం సినిమాలో కోపాన్ని ప్రదర్శించిన తీరు అభినందనీయం. జగపతి బాబు విలన్ గా అవతారమెత్తి హీరోని సైతం భయపెట్టారు. లెజెండ్ చిత్రంలో బాలయ్యకి ఎదురు నిలిచి అందరి మనసులు గెలిచారు.

8. ఎన్టీఆర్ (జై లవ కుశ, టెంపర్) ఆది సినిమాలో పగతో రగిలిపోయే తారక్ ని మనం చూశాం. టెంపర్ లో పూర్తి స్థాయిలో ఆవేశపరుడిగా మెప్పించారు. జై లవకుశలోను జై పాత్ర కోపంతో రగిలిపోతుంటుంది. అయినా అతని నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.

9. ప్రభాస్ (రాఘవేంద్ర) కెరీర్ కొత్తల్లో ప్రభాస్ షార్ట్ టెంపర్ యువకుడిగా రాఘవేంద్ర సినిమాలో నటించారు. అప్పుడే తన నటనతో అభిమానులతో చప్పట్లు అందుకున్నారు.

10. నాగార్జున (రక్షకుడు)తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పు చేసిన వాడి అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ కొట్టే పాత్రను రక్షకుడు చిత్రంలో నాగార్జున పోషించారు. అందమైన పాత్రల్లో కనిపించే నాగ్ ఆవేశపరుడిగా ఇందులో కొత్తగా చూశాం.

11 . వెంకటేష్ (ధర్మ చక్రం, గణేష్)విక్టరీ వెంకటేష్ చాలా సరదా పాత్రలు పోషిస్తుంటారు. చిన్నపిల్లలకు సైతం అతనంటే ఇష్టపడుతారు. అటువంటి వెంకీ.. ధర్మ చక్రం, గణేష్ సినిమాల్లో ఆవేశపరుడిగా అల్లాడించారు.

12 . విక్రమ్ ( శివ పుత్రుడు)విలక్షణ పాత్రలతో మెప్పించిన విక్రమ్ శివపుత్రుడు సినిమాలో ఆవేశాన్ని విభిన్నంగా ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

13 . దుల్కర్ సల్మాన్ (హే పిల్లగాడా)మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హే పిల్లగాడా సినిమాలో కోపంగా నటించి తెలుగువారి గుండెల్లో స్థానం అందుకున్నారు.

ఏ పాత్రలో నటించారని కాదు.. ఎంత బాగా నటించారనేది తెలుగు ప్రేక్షకులు చూస్తారని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలోకి వచ్చే ఏదైనా సినిమాను మేము మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus