భగవంతుడు అంటే నమ్మకం…భగవంతుడు అంటే…భయం…ఇదీ ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్న పద్దతి….అయితే నమ్మకంతో భగవంతుణ్ణి పూజిస్తారు…లేదా భయంతో భగవంతుడికి పూజలు చేస్తారు…అయితే భగవంతుడిని ఏమాత్రం కించపరిచి చూపించినా ఆయా మతాలను కించపరిచినట్లే అన్నది కొందరి వాదన…అయితే తాజాగా ఒక సినిమా టీజర్ ప్రకంపనలు సృష్టిస్తుంది….ఈ ఇంట్లో దేవుడున్నాడంటూ మొదలైన టీజర్….. ఆన్ లైన్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. శివలింగానికి సిగరెట్ లు – మాంసపు ముక్కలతో పూజలు.. మద్యంతో అభిషేకం.. “ద్యావుడా” టీజర్ చూసిన వారంతా “దేవుడా..” అంటూ ముక్కున వేలేసుకున్న పరిస్థితి. సినిమా అంటే కొత్తదనం ఉండాలి అని కోరు కున్నాడో ఏమో తెలీదు కానీ మొత్తానికైతే దేవుణ్ణి కించలరిచేలా కొన్ని సీన్స్ తెరకెక్కించాడు…కట్ చేస్తే విమర్శల పాలయ్యాడు…అంతేకాదు అరెస్ట్ కూడా అయ్యాడు.
విషయంలోకి వెళితే….”ద్యావుడా” సినిమాలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్ లో పోస్టు చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్ గా గజ్జెల హరికుమార్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లోని ఒక సన్నివేశంలో శివుడిపై అభ్యంతరకర సన్నివేశం ఉందని భజరంగ్ దళ్ కు చెందిన నవీన్ అనేవ్యక్తి వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరాంను అదుపులోకి తీసుకోగా.. నిర్మాత హరికుమార్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే ఈ సీన్స్ పై దర్శకుడి వాదన మరో విధంగా ఉంది….కర్ణాటక – ఉజ‍్జయినిలోని దేవాలయాల్లో మద్యం – సిగరెట్లతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని ఆ ఆచార వ్యవహారాలను స్ఫూర్తిగా తీసుకునే ఇలా చేశాను అని అంటున్నాడు సాయరాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.