Tollywood: టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇదే.. ఈ ఏడాది ఇండస్ట్రీకి కలిసొచ్చిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి 2024 ఫస్టాఫ్ ముగిసింది. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. జనవరి నెలలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కాగా హనుమాన్ (Hanuman) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే గుంటూరు కారం (Guntur Kaaram), నా సామిరంగ (Naa Saami Ranga) డీసెంట్ కలెక్షన్లను అందుకున్నాయి. సైంధవ్ మూవీ భారీ అంచనాలతో రిలీజైనా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడం గమనార్హం. ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలలో ఈగల్ (Eagle) యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) డీసెంట్ హిట్ గా నిలిచింది.

ఈ నెలలో సుందరం మాస్టర్ (Sundaram Master) సినిమా కూడా విడుదల కాగా థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చి నెలలో రిలీజైన సినిమాలలో గామి సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) సినిమా డీసెంట్ హిట్ గా నిలవగా టిల్లు స్వ్కేర్ (Tillu Square) సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏప్రిల్ లో విడుదలైన ఫ్యామిలీ స్టార్ భారీ అంచనాలతో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. ఏప్రిల్ నెలలో రిలీజైన సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

మే నెలలో రిలీజైన సినిమాల్లో ఆ ఒక్కటి అడక్కు (Aa Okkati Adakku) ఫ్లాప్ కాగా ప్రసన్నవదనం యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. గెటప్ శ్రీను (Getup Srinu) రాజు యాదవ్ (Raju Yadav) మూవీ ప్రేక్షకుల మెప్పు పొందలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) యావరేజ్ గా నిలవగా భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam) యావరేజ్ రిజల్ట్ అందుకుంది. జూన్ నెలలో రిలీజైన సినిమాలలో మనమే మూవీ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఈ నెల చివరి వారం విడుదలైన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదలైన డబ్బింగ్ సినిమాలలో ప్రేమలు (Premalu), భ్రమయుగం, ఆడుజీవితం (Aadujeevitham), మహారాజ సినిమాలు సక్సెస్ సాధించాయి. డబ్బింగ్ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus