సైరా చిత్రంలో కీలకరోల్ చేయనున్న తమన్నా

  • April 11, 2018 / 07:05 AM IST

ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి‘ తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను డైరక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా జోరుగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నయనతార, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. హోమం సన్నివేశాలను తెరకెక్కించారు.

ఇప్పుడు మరో సన్నివేశం కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందించారు. కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు. ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టం కోసమే ఈ సెట్ ను వేశారు. ఇక్కడ త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ షూటింగ్ లో చిరు, విజయ్ సేతుపతి, జగపతిబాబుతో పాటు తమన్నా పాల్గొనబోతున్నట్టు సమాచారం. మిల్క్ బ్యూటీ బాహుబలి సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేసింది. అటువంటి సీన్ ఇందులోనూ ఉంది. అందుకోసం కీలక పాత్ర కోసం తమన్నాను తీసుకున్నారు. గుర్రాలపై స్వారీ చేస్తూ కత్తులతో బ్రిటిష్ వారితో పోరాటానికి దిగే యువతిగా తమన్నా కనిపించనుందని టాక్. ఈ విషయాన్నీ చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus