ఒకప్పుడు తెలుగు సినిమాలకు కలెక్షన్ల పరంగా నైజాం ఏరియా అతి పెద్ద మార్కెట్ గా ఉండేది. కానీ ప్రస్తుతం ఓవర్సీస్ అతి పెద్ద మార్కెట్ గా ఏర్పడింది. మన తెలుగు చిత్రాలు ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతున్నాయి. కంటెంట్ ఉంటె చాలు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.
ఇక ఓవర్సీస్ అత్యధికంగా 1.5 మిలియన్ క్లబ్ లో మహేష్ బాబు నటించిన నాల్గు సినిమాలు, ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు ఉండడం విశేషం. మహేష్ నటించిన శ్రీమంతుడు, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, స్పైడర్ సినిమాలు క్లబ్ లో చోటు దక్కించుకోగా.. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఇక మిగతా ఏ ఏ చిత్రాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయో మీరే చూడండి.
1. బాహుబలి-2 – $20,571,695
2. బాహుబలి – $6,999,312
3. శ్రీమంతుడు – $2,890,786
4. అ..ఆ – $2,449,174
5. ఖైదీ నంబర్ 150 – $2,447,043
6. ఫిదా – $2,058,419
7. నాన్నకు ప్రేమతో – $2,022,392
8. అత్తారింటికి దారేది – $1,897,541
9. జనతా గ్యారేజ్ – $1,800,404
10. అర్జున్ రెడ్డి – $1,771,020
11. గౌతమీపుత్ర శాతకర్ణి – $1,662,775
12. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు – $1,635,300
13. ఊపిరి – $1,569,162
14. దూకుడు – $1,563,466
15. మనం – $1,538,515
16. జై లవకుశ – $1,538,330
17. స్పైడర్ – $1,500,044