కొంతమంది హీరోయిన్లకు ఎంత గ్లామర్ ఉన్నా.. ఫాలోయింగ్ ఉన్నా.. ఎందుకో కాలం కలిసి రక చతికిలపడిపోతుంటారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది అనూ ఇమ్మాన్యుయేల్. చూడడానికి మంచి కళ కళలాడిపోతుంటుంది ఈ భామ. నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక అటు తరువాత రాజ్ తరుణ్ తో చేసిన ‘కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా కూడా ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. క్రేజ్ కూడా మరింత పెరిగింది.
దీంతో వరుస అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ చేసిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’, నాగచైతన్యతో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలు ఈమెకు నిరాశనే మిగిల్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా ‘గీత గోవిందం’ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసినా.. ఈమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజానికి ఈ చిత్రంలో మొదట అనూ ఇమ్మాన్యుయేల్ నే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ పవన్, బన్నీ సినిమాల్లో నటించే అవకాశం రావడంతో.. ‘గీత గోవిందం’ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు లేవు. అయినప్పటికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయి అనే ధీమాతో ఉందట. ‘మొదట పెద్ద సినిమాల్లో అవకాశం రావడంతో కథ సరిగ్గా వినకుండా ఓకే చెప్పేసాను. ఈసారి మాత్రం ఆ తప్పు చేయను’ అని తన స్నేహితుల దగ్గర కూడా చెప్పిందట ఈ బ్యూటీ. అన్న మాట ప్రకారం ఈమధ్య కథ నచ్చలేదని రెండు ఆఫర్లు కూడా రిజెక్ట్ చేసిందట. మరి ఈమెకు బ్రేక్ ఇచ్చే డైరెక్టర్ ఎక్కడున్నాడో..!