స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవ్వడం అనేది కొత్త వార్త కాదు చాలా పాత వార్త. అయితే వాళ్ళ అభిమానులకు ఇది ఆసక్తిని కలిగించే వార్త అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ తో పాటు ఆమె తల్లిని కూడా మనం గమనించవచ్చు . ఈ పాటికే చాలా మంది గుర్తుపట్టేసి ఉంటారు.

ఈ బ్యూటీ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరితో జతకట్టింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు,ఎన్టీఆర్ వంటి హీరోలతో కూడా ఆడిపాడింది. ఒక్క అల్లు అర్జున్, రాంచరణ్ వంటి హీరోలకు జోడీగా మాత్రం ఈమె నటించలేదు. కానీ రాంచరణ్ నటించిన ఓ సినిమాలో ఈమె ఫ్లాష్ బ్యాక్ రోల్ లో కనిపిస్తుంది. ఓ రకంగా చరణ్ కు తల్లి పాత్ర అది అని చెప్పొచ్చు.

ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది కదా ఆమె ఎవరనేది. యెస్… ఆమెనే శ్రీయ శరన్. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలతో కంటే ఫ్యామిలీ ఫోటోలు, హాట్ ఫొటోలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. విదేశీయుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు జన్మనిచ్చింది కూడా..! అయితే ఆమెకు పాప పుట్టిన సంగతి ఏడాది వరకు ఎవ్వరికీ రివీల్ చేయలేదు.

ఇక శ్రీయ చిన్నప్పటి ఫోటోల విషయానికి వస్తే.. ఇందులో ఆమెను తన తల్లి ఎత్తుకుని ముద్దాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈమె చిన్నప్పటి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

 

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus