Mohan Babu: ఈ టాలీవుడ్ హీరోయిన్ అప్పట్లో మోహన్ బాబు విద్యాసంస్థల్లోనే చదువుకుందట..!

హీరోగా , విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , నిర్మాతగా, విద్యావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. భక్తవత్సలం నాయుడుగా సినిమాల్లో అడుగుపెట్టి మోహన్‌బాబుగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 600 పైచీలుకు చిత్రాల్లో నటించి సత్తా చాటారు. ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘‘అలీతో సరదాగా’’ కార్యక్రమం 250 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ గెస్ట్‌గా ఆయన హాజరయ్యారు.

రెండు భాగాలుగా ప్రసారమైన ఆ ఎపిసోడ్‌కు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, ఎదుర్కొన్న కష్టాలు, అన్నగారితో అనుబంధం, రాజకీయాలు, సినీ పరిశ్రమలోని ప్రస్తుత సమస్యలపై తన మనసులోని మాటలను మోహన్ బాబు పంచుకున్నారు. ఇదే సమయంలో ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్న వారిలో ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్‌తో పాటు మరెన్నో ఉన్నత స్థానాల్లో వున్నారని మోహన్ బాబు తెలిపారు. అలాంటి వారిలో ఒక హీరోయిన్ కూడా వుందని..

ప్రస్తుతం ఆమె టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్‌గా కొనసాగుతోందని ఆయన చెప్పారు. అయితే ఆ అమ్మాయి పేరు గుర్తురావట్లేదని మోహన్ బాబు షోలో చెప్పారు. దీంతో ఆ హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ అని తెలుస్తోంది. ఈ అమ్మడు తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరవాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రంలో ఐశ్వర్య నటించింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus