Prabhas: ప్రభాస్ పై ఫోకస్ పెట్టిన స్టార్ డైరెక్టర్?

  • July 19, 2021 / 01:22 PM IST

స్టార్ హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టారు. అయితే ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. చరణ్, ప్రభాస్ మినహా యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో సినిమాలు తీసిన త్రివిక్రమ్ ప్రభాస్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ కాంబోలో ఒక మూవీకి సంబంధించి చర్చలు మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాహుబలి సిరీస్ సినిమాల సక్సెస్ తో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల విజయాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకునిగా తన స్థాయిని పెంచుకున్నారు. త్రివిక్రమ్ మాటలను ఇష్టపడి మాటల కోసమే సినిమాలను చూసే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉన్నారు. కథలో ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇస్తూనే కామెడీ మిస్ కాకుండా త్రివిక్రమ్ జాగ్రత్త పడతారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా తీయాలని ప్రయత్నించినా ప్రభాస్ నుంచి వెంటనే గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమేనని చెప్పవచ్చు.

ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్ అయితే హారిక హాసిని బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్రివిక్రమ్ మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేయగా ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus