2006 లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఆ తర్వాత ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ తో ఈమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి.. తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా రాణించిన ఆమె ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియానే నమ్ముకున్నారు.
ఇక్కడ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం ఈమె తల్లి కాబోతున్నానని తన బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి కాకుండానే ఈమె తల్లి కాబోతున్నట్టు తెలపడం అందరినీ ఆలోచనలో పడేసింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం.. కొంచెం గతంలోకి వెళ్లి చూస్తే ‘పోకిరి’ తర్వాత.. తెలుగులో ఇలియానాకి బాగా డిమాండ్ పెరిగింది.
ఆమె కాల్ షీట్ల కోసం దర్శకనిర్మాతలు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆమె డిమాండ్లు కూడా బాగా పెరిగాయి. తెలుగులో కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసిన హీరోయిన్ ఇలియానానే..! అందుకు దర్శకనిర్మాతలు కూడా వెనుకాడకుండా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఎగబడ్డారు. ఒకేసారి 7 , 8 సినిమాల షూటింగ్లలో ఆమె పాల్గొనేది. అయితే ఒకసారి ఇలియానాకి చేదు అనుభవం ఎదురైంది. ఓ బడా టాలీవుడ్ హీరో, అప్పుడప్పుడే ఎదుగుతున్న దర్శకుడు, బడా నిర్మాత కాంబోలో ఓ విజయవంతమైన సినిమా రూపొందింది.
ఆ చిత్రం షూటింగ్ కు ఇలియానా (Ileana) చాలా లేట్ గా వెళ్ళేదట. యూనిట్ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తించేదట. ఈ క్రమంలో ఆ చిత్రంలో నటిస్తున్న హీరో.. ఇలియానా చెంప పై ఒక్కటిచ్చాడట. దర్శకనిర్మాతలను, ఇంతమంది యూనిట్ సభ్యులను ఇన్నేసి గంటలు వెయిట్ చేయించడం సరైన పద్ధతి కాదు… అంటూ ఆమెను మందలించాడట. దీంతో ఇలియానా ఆ సినిమా షూటింగ్ కు వారం రోజుల పాటు వెళ్లలేదట. తర్వాత నిర్మాత స్వయంగా వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో షూటింగ్లో జాయిన్ అయ్యిందట.