నిజజీవితంలోనూ ఆ పని చేసిన యువ కథానాయకుడు

సినిమాల్లోకి రావడానికి ముందు నేను రోడ్ల మీద పడుకున్నాను, అన్నదానాల టైమ్ లో క్యూలో నిల్చోని మరీ తిన్నాను అని మన స్టార్ హీరోలు తమ పాత రోజుల గురించి ఇంటర్వ్యూల్లో చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. అందులో నిజమెంత, అబద్ధం ఎంత అనేది మనకి అస్సలు తెలియదు. కానీ.. ఆ విషయాలను గుడ్డిగా నమ్మేస్తుంటాం. అయితే.. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా మాత్రం తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో చెప్పిన విషయం మాత్రం వైరల్ అయిపోయింది. మనోడు సినిమాల్లోకి రావడానికి ముందు స్పెర్మ్ (వీర్యం) అమ్ముకోనేవాడట. విశేషం ఏంటంటే.. అదే కాన్సెప్ట్ తో వచ్చిన “విక్కీ డోనర్”లో మనోడే టైటిల్ పాత్రధారి. ఆ చిత్ర దర్శకుడు సూజిత్ కి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన కూడా షాక్ అయ్యాడట.

ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఆయుష్మాన్. మధ్యలో కొన్ని చెత్త సినిమాలు చేసి కెరీర్ లో ఎత్తుపల్లాలను చూసిన ఆయుష్మాన్ ఖురానా “బరేలీ కి బర్ఫీ” నుంచి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ముఖ్యంగా.. “బాధాయ్ హో, అంధాధున్” లాంటి వరుస విజయాల తర్వాత మనోడి స్టార్ డమ్ భీభత్సంగా పెరిగింది. ఈ తరుణంలో తాను స్పెర్మ్ అమ్ముకునేవాడిని అని చెప్పడం చర్చనీయాంశం అయినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus