Star Heroes: ఆ విషయంపై ఫోకస్ పెడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. ఒక సినిమా విడుదల కాకముందే మరో ప్రాజెక్ట్ ను ప్రకటించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర, ప్రశాంత్ నీల్ మూవీ, అయాన్ ముఖర్జీ మూవీ, సుకుమార్ సినిమాలతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలకు భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా ఏదనే ప్రశ్నకు జవాబు తెలియదు. అయితే కొందరు డైరెక్టర్లకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సరైన టైమ్ వస్తే అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తుండటం గమనార్హం. సినిమాల విషయంలో, డైరెక్టర్ల విషయంలో ఒకింత బ్యాలెన్స్ చేస్తూ చరణ్ ముందడుగులు వేస్తున్నారు.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మహేష్, పవన్ సైతం తర్వాత ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటనున్నారు. ఈ హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఈ హీరోలకు క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. ఈ హీరోలలో చాలామంది హీరోలు పలు సర్వేలలో టాప్3 జాబితాలో నిలుస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు.

ఈ హీరోలకు (Star Heroes) సోషల్ మీడియాలో సైతం కళ్లు చెదిరే స్థాయిలో క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో సైతం ఈ హీరోలు వరుస విజయాలతో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ హీరోలు సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus