పొలిటీషన్ గెలవడంతో పండగ చేసుకుంటున్న హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు నడుమ ఎఫైర్లు ఉండడం అనేది సర్వసాధారణం. ఈ తరహా వ్యవహారాలు బయటకి పొక్కినా జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ.. ప్రస్తుతం ఓ సీక్రెట్ ఎఫైర్ మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్ని విస్మయానికి గురి చేసింది. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ హోదా ఎంజాయ్ చేస్తున్న ఒక హీరోయిన్ ఏకంగా ఓ టాప్ పొలిటీషియన్ తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకొంది. మొదట్లో ఈ విషయం ఎవరికీ తెలియకపోయినా.. మొన్న తెలంగాణ ఎన్నికల సమరంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొనే సందర్భంలో ఈ మేటర్ బయటకి పోక్కింది. దాంతో ఆ స్టార్ హీరోయిన్ తోపాటు సదరు పాపులర్ పొలిటీషియన్ కూడా ఈ విషయం ఎక్కడ పబ్లిక్ అవుతుందో అని భయపడి చచ్చారు.

కట్ చేస్తే.. ఇవాళ రిజల్ట్స్ లో ఆ స్టార్ పొలిటీషియన్ నెగ్గడంతో నిన్నటివరకూ హడావుడి చేసిన అపోజిషన్ సైలెంట్ అయిపోయింది. దాంతో నిన్నమొన్నటివరకు భయపడిన హీరోయిన్ కూడా ఇప్పుడు ఆనందంతో ఓ ప్రయివేట్ పార్టీ అరేంజ్ చేసింది. ఏదేమైనా.. ఈ తరహా సీక్రెట్ ఎఫైర్స్ ఆ హీరోయిన్ కి కమర్షియల్ గా ఏమైనా వర్కవుట్ అవ్వోచ్చేమో కానీ.. పర్సనల్ గా మాత్రం చాలా చేటు చేస్తాయి. ఈ విషయాన్ని అమ్మడు కాస్త త్వరగా గ్రహిస్తే మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus