కుర్ర హీరోలకు కూడా దడ పుట్టిస్తున్న సీనియర్ స్టార్ హీరోలు

ఇప్పట్లో అంటే కమర్షియల్ సినిమాలతో కాలం గడిచిపోతుంది. థియేటర్ వరకూ సినిమాకి వెళ్ళాలంటే ప్రేక్షకులు చాలా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది.. అందులోనూ ‘అమెజాన్’ ‘నెట్ ఫ్లిక్స్’ వంటివి వచ్చేసాయి. సినిమా బాగుందనే టాక్ వస్తే తప్ప.. జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. అది కూడా రివ్యూలు, రేటింగ్లు చూసుకునే వెళుతున్నారు. పోనీ హిట్టయిన సినిమా కనీసం 50 రోజులైనా ఆడుతుందా అంటే అదీ లేదు. 2 వారలు మాత్రమే టార్గెట్ గా సినిమాలు వస్తున్నాయి. ఓ పెద్ద సినిమా వస్తుంది అంటే.. మరో పెద్ద సినిమా రాజీ పడుతుందని. కానీ… అప్పట్లో అలా కాదు… 100 రోజుల వరకూ థియేటర్లు కళకళాడిపోయేవి. అప్పట్లో అంటే మరీ ‘బ్లాక్ అండ్ వైట్’ రోజుల వరకూ వెళ్ళిపోనక్కర్లేదు. జస్ట్ ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళితే చాలు.

అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారి సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొనేది. ఒక హీరో సినిమా కోసం మరో హీరో రాజీ పడటం లాంటివి ఉండేవి కాదు. ప్రేక్షకులు కూడా అందరి సినిమాలని ఆదరించేవారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు లాభ పడేవారు. అయితే సీనియారిటీ రావడంతో ఈ హీరోల జోష్ తగ్గిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరి సందడి మొదలైనట్టు కనిపిస్తుంది. ఇప్పటి వారి లుక్స్ చూస్తుంటే.. ఇప్పటి కుర్ర హీరోలకి పెద్ద సవాలు విసురుతున్నట్టే కనిపిస్తుంది.

మెగాస్టార్ ‘కం బ్యాక్’ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ తో వందకోట్ల షేర్ ను రాబట్టి.. ఇంకా ఆయన స్థానం అలాగే ఉందని ప్రూవ్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సైరా’ చిత్రానికి అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది. ఇక ఆయన 152 వ చిత్రం కొరటాల డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం అప్పుడే ఫోటో షూట్ కూడా చేసేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇక బాలకృష్ణ ‘సింహా’ ‘లెజెండ్’ ‘జై సింహా’ వంటి చిత్రాలతో తన స్టామినా చూపించాడు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ నిరాశపరిచినప్పటికీ.. ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చేందుకు రెండు, మూడు స్క్రిప్ట్ లు ఫైనల్ చేశాడట.

ఇక నాగార్జున ‘మనం’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘ఊపిరి’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు ‘ఓం నమో వెంకటేశాయ’ ‘ఆఫీసర్’ ‘దేవదాస్’ వంటి చిత్రాలతో దెబ్బ తిన్నాడు. అయినప్పటికీ ‘మన్మధుడు2’ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతానని మంచి కాన్ఫిడెన్స్ వ్యక్తంచేస్తున్నాడు. ఆగష్టు 9 న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక మన వెంకటేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన ప్లస్ పాయింట్ అయిన కామెడీ టైమింగ్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించించాడు. ఇప్పుడు తన మేనల్లుడు నాగచైతన్య తో ‘వెంకీమామ’ చిత్రం చేస్తున్నాడు. ‘పవర్’ ఫేమ్ బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం కూడా సాలిడ్ హిట్టయ్యేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus