సినిమా పరిశ్రమలో బిజీ బిజీగా గడుపుతున్న తారల్లో కొందరు తమ సంపాదనతో ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందులో కొందరు డబ్బు సంపదనే ధేయంగా ముందుకు పోతుంటే, మరికొందరు స్వీయ సంతృప్తి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మరి మన తారల్లో వ్యాపార దిగ్గజాలు ఎవరో, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం రండి.
‘కలెక్షన్ కింగ్’-మోహన్ బాబుటాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మనకు పరిచయం అయితే మోహన్ బాబు, రాజ్య సభ సభ్యునిగా ఉన్న కాలంలో తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఎజుకేషనల్ ట్రస్ట్ ను నెలకొల్పారు. దాదాపుగా 6కాలేజీలకు ఆయన యజమానిగా ఉన్నారు.
అక్కినేని నాగార్జునటాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న నాగ్ కు సినిమాల కన్నా బయట వ్యాపారు ఎక్కువ, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, ఇండియన్ బ్యాడ్‌మింటన్ ముంబై జట్టు యజమానుల్లో ఒకరుగా, ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ అధినేతగా, కల్యాణ్ జ్యుయెలర్స్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు నాగ్.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న చెర్రీ టర్బు మేఘ ఏర్‌వేస్ అధినేతగానే కాకుండా, హైడేరాబద్ పోలో రైడింగ్ క్లబ్, పోలో టీమ్ కు అధినేతగా ఉన్నారు.
స్మితపోప్ సింగర్ స్మిత పాటల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ దూసుకుపోతుంది. క్యాండీ ఎంటర్‌టేన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాకుండా, సంగీతం , కళలు , యోగ మరియు నృత్యం నేర్పించే స్టూడియోస్ కు సైతం అధినేతగా ఉన్నారు.
శరహ్ జానే డైయాస్పవన్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ, ముంబైలో బటర్‌ఫ్లై బేకరీ అనే ప్రఖ్యాత బేకరీని నడుపుతుంది.
శిల్పాశెట్టిహింది హీరోయిన్ గా, తెలుగులో సైతం 3సినిమాల్లో నటించిన ఈ భామ, ఐపీయెల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కు అధినేతగా ఉన్నారు. అంతేకాకుండా ముంబైలోని క్లబ్ రాయల్టీ అధినేతగా సైతం ఉండడం విశేషం.
శర్వానంద్టాలీవుడ్ చాక్లేట్ బోయ్ శర్వానంద్, జూబ్లీ హిల్స్ లో ఒక కేఫ్, ఒక రెస్టోరెంట్ కు అధినేతగా ఉన్నారు.