టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంకా జవాల్కర్ అందరికీ సుపరిచిత్రమే. ‘ట్యాక్సీ వాలా’ ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుని ‘గమనం’ మూవీతో కూడా పర్వాలేదనిపించింది. అయితే ఈ బ్యూటీ యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తో డేటింగ్ లో ఉంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఊరికే ఇలాంటి వార్తలు పుట్టుకురావు.. దీనికి ఓ కారణం కూడా ఉంది. ఉగాది సందర్భంగా ప్రియాంక జవాల్కర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.
దీనికి వెంకటేశ్ అయ్యర్ ఓ కామెంట్ పెట్టాడు. ఇది చూసిన ప్రియాంక జవాబిచ్చింది.అంతే ఇలాంటి డిస్కషన్లు మొదలైపోయాయి. పూరి వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంక జవాల్కర్ నిత్యం తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజు నాడు కూడా కొన్ని ఫోటోలని షేర్ చేసి ‘బూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె క్రీమ్ కలర్ షోల్డర్ కట్ టాప్ వేసుకుని కర్టన్ వెనకాల ‘జల్సా’ లో ఇలియానాలా ఉంది.
ఈ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ పెట్టాడు. అతని కామెంట్ కు ప్రియాంక ‘ఎవరు నువ్వు?’ అనే అర్ధం వచ్చేలా జవాబిచ్చింది. ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరూ.. ఒకరి ప్రొఫైల్స్ ను ఒకరు ఫాలో అవుతున్నారు. అయినా సరే ప్రియాంక ఇలాంటి కామెంట్ పెట్టి.. ఏదో విషయాన్ని దయాలనుకుంటుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.అందుకే ‘ఆపండి మీ ఓవరాక్షన్.మాకు అర్ధమైందిలే, మీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొంతమంది అయితే ‘వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది’. ‘ఆయనెవరో తెలీదా ఇండియన్ క్రికెటర్, నెక్ట్ జనరేషన్‌కు స్టార్ క్రికెటర్ అవుతాడు’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఇంకొంత మంది అయితే ‘డౌట్ లేదు వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు.పెళ్ళి కూడా చేసుకుంటారేమో’ అంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.మరి ఇలాంటి వార్తల పై ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతుందో.. అసలు రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి..!