‘అల్లుడు’ తో ఆ ముచ్చట కూడా తీర్చుకునేలా ఉన్నాడు..!

  • October 29, 2020 / 06:18 PM IST

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు సాయి శ్రీనివాస్. 2014 లో వి.వి.వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్.. మొదటి చిత్రంతోనే మాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ‘జయ జానకి నాయకా’ చిత్రం కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ‘రాక్షసుడు’ చిత్రం శ్రీనివాస్ ను మంచి నటుడుగా నిలబెట్టింది. అయితే ‘సీత’ ‘రాక్షసుడు’ వంటి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేసి మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉంటూ వచ్చాడు ఈ యంగ్ హీరో.

అయితే ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సోనూసూద్, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్’ తో కచ్చితంగా ఓ మాస్ హిట్ కొట్టాలని.. 2021 సంక్రాంతికే రాబోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ ఆడియెన్స్ లో ఈ కుర్ర హీరో సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటాడు కాబట్టి..

ఈ యంగ్ హీరోకి సరైన సినిమా పడితే స్టార్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్క ‘కవచం’ ‘సీత’ చిత్రాలను పక్కనపెట్టేస్తే సాయి శ్రీనివాస్ నటించిన దాదాపు అన్ని సినిమాలు మాస్ ఆడియెన్స్ ను బాగా మెప్పించాయి. మరి ‘అల్లుడు అదుర్స్’ తో కనుక మాస్ హిట్ కొడితే.. ఈ కుర్ర హీరో తన టార్గెట్ ను రీచ్ అయినట్టే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus