మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2 న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం వెంకటేష్ పెద్ద హీరోనే తన ‘వెంకీమామ’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అంతేకాదు మెగాస్టార్ తో పోటీ ఎందుకని చాలామంది మార్కెట్ ఉన్న హీరోలు భయపడి తమ చిత్రాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.
అయితే ఓ యాక్షన్ హీరో మాత్రం అస్సలు భయపడట్లేదు. ఆ యాక్షన్ హీరో మరెవరో కాదు గోపీచంద్. అవును గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘చాణక్య’ అక్టోబర్ 5 న విడుదల కానుంది. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాత. తిరు డైరెక్షన్లో 35కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో అంటే గోపీచంద్ కు మంచి మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు తిప్పికొడితే 15 కోట్ల మార్కెట్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఓ పాన్ ఇండియా చిత్రానికి అందులోనూ మెగాస్టార్ చిత్రానికి పోటీగా దిగితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. మరి గోపీచంద్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి..!