Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » టాలీవుడ్‌లో వచ్చిన 10 బెస్ట్ లవ్ స్టోరీస్ ఏవంటే..!

టాలీవుడ్‌లో వచ్చిన 10 బెస్ట్ లవ్ స్టోరీస్ ఏవంటే..!

  • February 15, 2023 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో వచ్చిన 10 బెస్ట్ లవ్ స్టోరీస్ ఏవంటే..!

ప్రేమ.. లవ్, ప్యార్, ఇష్క్, కాదల్, మెహబ్బత్.. భాష ఏదైనా భావం ఒకటే.. పేరేదైనా ప్రేమ ఒకటే.. ప్రపంచ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రేమకథా చిత్రాలు చాలానే ఉన్నాయి.. మన తెలుగులో బ్లాక్ & వైట్ నాటి నుండే ప్రేమకథలకు బీజం పడింది.. ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ‘దేవదాసు’ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు.. తర్వాత ఎన్నో క్లాసిక్ లవ్ స్టోరీస్ తెరకెక్కాయి.. ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగులో 1989 నుండి 2022 మధ్యలో వచ్చిన 10 బెస్ట్ లవ్ స్టోరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రేమ – 1989..

విక్టరీ వెంకటేష్ – రేవతి జంటగా.. సురేష్ కృష్ణ తీసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ‘ప్రేమ’.. క్రిస్టియన్ యువతికి, హిందూ యువకుడికి మధ్య జరిగే హార్ట్ టచ్చింగ్ ప్రేమకథ ఇది.. మ్యాగీ – పృథ్వీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.. ఇళయ రాజా పాటలు సినిమాకు ప్రాణం పోశాయి..

గీతాంజలి – 1989..

నాగార్జున – గిరిజ నటించగా.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ‘గీతాంజలి’.. హృదయాల్ని హత్తుకునే భావోద్వేగభరితమైన ప్రేమ కథ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఐకానిక్ సీన్స్, క్లాసిక్ సాంగ్స్ ఎప్పటికీ చెక్కు చెదరవు..

తొలిప్రేమ – 1998..

పవన్ కళ్యాణ్ – కీర్తి రెడ్డిల ‘తొలిప్రేమ’ ది మరో సంచలనం.. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీతో పవన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. తను చేసిన ఫ్రెండ్లీ నేబర్ హుడ్ బాలు క్యారెక్టర్ గుర్తుండిపోతుంది.. పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

ఆనంద్ – 2004..

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ‘ఆనంద్’.. రాజా – కమిలినీ ముఖర్జీల రూప – ఆనంద్ క్యారెక్టర్లు కానీ కామెడీ, రొమాంటిక్ సీన్స్ కానీ చూసిన ప్రతి సారీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తాయి..

ఆర్య – 2004..

అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలది ఒక దారి అయితే.. ‘ఆర్య’ మూవీది ఇంకో రూట్.. ‘వన్ సైడ్ లవ్’ అనే కాన్సెప్ట్ యువతకి కొత్త అనుభూతినిచ్చింది.. డిఫరెంట్‌గా వచ్చిన ఈ చిత్రం పెద్ద మ్యాజిక్కే చేసింది..

ఏ మాయ చేశావే – 2009..

సినిమాలో సమంత – నాగ చైతన్య కనిపించరు.. జెస్సీ – కార్తీక్ పాత్రలే కనిపిస్తాయి.. ప్రేక్షకులను ప్రేమలో పడేస్తాయి.. ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కంప్లీట్‌గా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మ్యాజిక్ అనే చెప్పాలి..

డార్లింగ్ – 2010..

ప్రభాస్ – కాజల్ అగర్వాల్ జంటగా.. ప్రేమకథకు ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేసి.. ‘తొలిప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ తీసిన మరో క్లాసిక్.. ‘డార్లింగ్’.. ప్రభాస్ – కాజల్‌ల క్యూట్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

మళ్లీ రావా – 2017..

సుమంత్ కొంత గ్యాప్ తర్వాత ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ లవ్ ఫిలింతో ట్రాక్‌లోకి వచ్చాడు.. మన లైఫ్‌లో ముఖ్యమైన మూడు ఫేసెస్‌ని రెండు గంటల్లో అద్బుతంగా చూపించిందీ చిత్రం.. క్లైమాక్స్ సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చింది..

సమ్మోహనం – 2018..

Sammohanam Movie Review

పాపులర్ యాక్ట్రెస్, కార్టూనిస్ట్‌తో ప్రేమలో పడడం అనేదే ‘సమ్మోహనం’.. కామెడీతో పాటు ఎమోషన్స్ కలగలసిన అందమైన మ్యూజికల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది..

సీతా రామం – 2022..

1960లో ఇండియా – పాకిస్థాన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ.. ‘సీతా రామం’.. దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్‌ల కెమిస్ట్రీ సినిమాకి మేజర్ హైలెట్.. హృదయాల్ని కదిలించే.. మనసుల్ని హత్తుకునే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు చిత్రాన్ని అద్భుతమైన, అపురూపమైన కళాఖండంగా మలిచాయి.. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చూసిన ప్రతి సారీ కంటతడి పెట్టిస్తుంది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SangeethaMobiles!
  • #Anand
  • #darling
  • #Malli Raava
  • #Prema

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

3 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

23 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version