ప్రేమ.. లవ్, ప్యార్, ఇష్క్, కాదల్, మెహబ్బత్.. భాష ఏదైనా భావం ఒకటే.. పేరేదైనా ప్రేమ ఒకటే.. ప్రపంచ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రేమకథా చిత్రాలు చాలానే ఉన్నాయి.. మన తెలుగులో బ్లాక్ & వైట్ నాటి నుండే ప్రేమకథలకు బీజం పడింది.. ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ‘దేవదాసు’ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు.. తర్వాత ఎన్నో క్లాసిక్ లవ్ స్టోరీస్ తెరకెక్కాయి.. ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి.. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగులో 1989 నుండి 2022 మధ్యలో వచ్చిన 10 బెస్ట్ లవ్ స్టోరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రేమ – 1989..
విక్టరీ వెంకటేష్ – రేవతి జంటగా.. సురేష్ కృష్ణ తీసిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ‘ప్రేమ’.. క్రిస్టియన్ యువతికి, హిందూ యువకుడికి మధ్య జరిగే హార్ట్ టచ్చింగ్ ప్రేమకథ ఇది.. మ్యాగీ – పృథ్వీ పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.. ఇళయ రాజా పాటలు సినిమాకు ప్రాణం పోశాయి..
గీతాంజలి – 1989..
నాగార్జున – గిరిజ నటించగా.. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తీసిన ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ‘గీతాంజలి’.. హృదయాల్ని హత్తుకునే భావోద్వేగభరితమైన ప్రేమ కథ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఐకానిక్ సీన్స్, క్లాసిక్ సాంగ్స్ ఎప్పటికీ చెక్కు చెదరవు..
తొలిప్రేమ – 1998..
పవన్ కళ్యాణ్ – కీర్తి రెడ్డిల ‘తొలిప్రేమ’ ది మరో సంచలనం.. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీతో పవన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. తను చేసిన ఫ్రెండ్లీ నేబర్ హుడ్ బాలు క్యారెక్టర్ గుర్తుండిపోతుంది.. పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..
ఆనంద్ – 2004..
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ‘ఆనంద్’.. రాజా – కమిలినీ ముఖర్జీల రూప – ఆనంద్ క్యారెక్టర్లు కానీ కామెడీ, రొమాంటిక్ సీన్స్ కానీ చూసిన ప్రతి సారీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తాయి..
ఆర్య – 2004..
అప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలది ఒక దారి అయితే.. ‘ఆర్య’ మూవీది ఇంకో రూట్.. ‘వన్ సైడ్ లవ్’ అనే కాన్సెప్ట్ యువతకి కొత్త అనుభూతినిచ్చింది.. డిఫరెంట్‌గా వచ్చిన ఈ చిత్రం పెద్ద మ్యాజిక్కే చేసింది..
ఏ మాయ చేశావే – 2009..
సినిమాలో సమంత – నాగ చైతన్య కనిపించరు.. జెస్సీ – కార్తీక్ పాత్రలే కనిపిస్తాయి.. ప్రేక్షకులను ప్రేమలో పడేస్తాయి.. ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కంప్లీట్‌గా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మ్యాజిక్ అనే చెప్పాలి..
డార్లింగ్ – 2010..
ప్రభాస్ – కాజల్ అగర్వాల్ జంటగా.. ప్రేమకథకు ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేసి.. ‘తొలిప్రేమ’ ఫేమ్ కరుణాకరన్ తీసిన మరో క్లాసిక్.. ‘డార్లింగ్’.. ప్రభాస్ – కాజల్‌ల క్యూట్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది..
మళ్లీ రావా – 2017..
సుమంత్ కొంత గ్యాప్ తర్వాత ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ లవ్ ఫిలింతో ట్రాక్‌లోకి వచ్చాడు.. మన లైఫ్‌లో ముఖ్యమైన మూడు ఫేసెస్‌ని రెండు గంటల్లో అద్బుతంగా చూపించిందీ చిత్రం.. క్లైమాక్స్ సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చింది..
సమ్మోహనం – 2018..
పాపులర్ యాక్ట్రెస్, కార్టూనిస్ట్‌తో ప్రేమలో పడడం అనేదే ‘సమ్మోహనం’.. కామెడీతో పాటు ఎమోషన్స్ కలగలసిన అందమైన మ్యూజికల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది..
సీతా రామం – 2022..
1960లో ఇండియా – పాకిస్థాన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ.. ‘సీతా రామం’.. దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్‌ల కెమిస్ట్రీ సినిమాకి మేజర్ హైలెట్.. హృదయాల్ని కదిలించే.. మనసుల్ని హత్తుకునే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు చిత్రాన్ని అద్భుతమైన, అపురూపమైన కళాఖండంగా మలిచాయి.. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చూసిన ప్రతి సారీ కంటతడి పెట్టిస్తుంది..