Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం
- September 12, 2026 / 10:48 PM ISTByPhani Kumar
రాజ్ తరుణ్ హీరోగా ‘టార్టాయిస్'(Tortoise) అనే సినిమా రూపొందుతోంది. రిత్విక్ కుమార్ దర్శకుడు. ‘ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్’ ‘ప్రశ్విత ఎంటర్టైన్మెంట్’ ‘ఎన్ వీ ఎల్ క్రియేషన్స్’ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.మానస కుమార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Tortoise
ఇటీవల ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా ‘ నీ పరిచయం..’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ లవర్స్ ను ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ నేపధ్యంలో ‘నీ పరిచయమే’ సాంగ్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సాంగ్ 10 మిలియన్స్ కు పైగా డిజిటల్ వ్యూస్ ను సాధించింది. సినిమాకి సంబంధించిన తొలి పాటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంపై ‘టార్టాయిస్’ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.
అనూప్ రూబెన్స్ బ్యూటిఫుల్ మెలొడీ ట్యూన్,ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం, సింగర్ చిన్మయి గాత్రం.. ఈ పాటని చార్ట్ బస్టర్ గా నిలబెట్టాయి అని చెప్పొచ్చు. ఇటీవల రాజ్ తరుణ్ నుండీ వచ్చిన సినిమాల్లో మ్యూజికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ‘టార్టాయిస్’ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సస్పెన్స్, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.















