ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేకుండా కట్ చేసి పాడేశారు

  • October 13, 2018 / 10:31 AM IST

సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక చూసుకొన్నదానికి.. థియేటర్లో సదరు సినిమా చూసుకొన్నదానికి చాలా తేడా ఉంటుంది. అందుకు కారణం ఈమధ్యలో చాలా చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒక్కోసారి రీషూట్ లు జరుగుతాయి, ఇంకోసారి ఉన్న సీన్లకు కత్తెర కూడా పడుతుంది. అలా తన పాత్రకు పడిన కత్తెర కారణంగా చాలా బాధపడుతున్నాడు ఆదర్ష్ బాలకృష్ణ. “హ్యాపీ డేస్”తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆదర్ష్ “బిగ్ బాస్” షోకి వెళ్లొచ్చిన తర్వాత సినిమాల జోరు పెంచాడు. అలా ఫామ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాల్లో “అరవింద సమేత” కూడా ఒకటి. క్యారెక్టర్ ఏమిటన్నది తెలియదు కానీ.. ఒక రెండుమూడు రోజుల షూట్ లో పాల్గొన్నాడు ఆదర్ష్.

కానీ.. మొన్న విడుదలైన సినిమాలో మాత్రం ఆదర్ష్ కనిపించలేదు. దాంతో ఆదర్ష్ మాత్రమే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా అదేంటీ ఫోటోల్లో కనిపించాడు, సినిమాలో లేడేంటి అనుకొన్నారు. కట్ చేస్తే.. సినిమాలో లెంగ్త్ కారణంగా కట్ అయిన క్యారెక్టర్స్ లో తనది కూడా ఒకటని తెలుసుకొన్న ఆదర్ష్ బాధపడడం తప్ప చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఎడిటడ్ సీన్స్ అంటూ యూట్యూబ్ లో లేదా అన్ కట్ వెర్షన్ ఏమైనా రిలీజ్ అయితే అందులో ఆదర్శ్ కనబడతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus