Acharya ,KGF2: ఏప్రిల్ లో ఏ సినిమా రికార్డులు సృష్టిస్తుందో?

మార్చి నెలలో రెండు వారాల గ్యాప్ లో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో రాధేశ్యామ్ ఫ్లాప్ గా నిలిస్తే ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ లో కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నప్పటికీ ప్రధానంగా అంచనాలు నెలకొన్న సినిమాలు మాత్రం కేజీఎఫ్2, ఆచార్య మాత్రమేనని చెప్పాలి. ఈ రెండు సినిమాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో పాటు ఈ రెండు సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

Click Here To Watch NOW

కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా కేజీఎఫ్ ఛాప్టర్1 కు సీక్వెల్ గా తెరకెక్కింది. 2018 సంవత్సరంలో విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్1 అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో కేజీఎఫ్ ఛాప్టర్2 పై ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ట్రైలర్ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ను మించి వ్యూస్ సాధించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి, చరణ్ కలిసి నటించారు. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఆచార్య మూవీ తెరకెక్కింది. కాజల్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా చిరంజీవి, చరణ్ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

అటు కొరటాల శివకు ఇటు ప్రశాంత్ నీల్ కు దర్శకులుగా మంచి గుర్తింపు ఉంది. ఆచార్యతో పోలిస్తే మరింత ఎక్కువ బడ్జెట్ తో కేజీఎఫ్2 తెరకెక్కినా తెలుగు రాష్ట్రాల వరకు చిరంజీవి, చరణ్ లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే మాత్రం ఇండస్ట్రీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus