కాజల్ (Kajal Aggarwal) 17 ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. పాయల్ ఓ 6 ఏళ్ళ పాటు బిజీ హీరోయిన్ గా గడిపింది. వీళ్ళిద్దరి కెరీర్ దాదాపు క్లైమాక్స్ కి వచ్చినట్టే అని చెప్పాలి. స్టార్ హీరోల సరసన వీరికి ఆఫర్లు రావడం లేదు. సీనియర్ స్టార్ హీరోలు కూడా వీళ్లపై పెద్దగా కాన్సెంట్రేట్ చేయడం లేదు. అందుకే యంగ్ హీరోల సినిమాల్లో, విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జూన్ 7 న వీళ్ళు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకే రోజు ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాజల్ సినిమా టైటిల్ ‘సత్యభామ’ (Satyabhama) కాగా, పాయల్ (Payal Rajput) నటిస్తున్న సినిమా టైటిల్ ‘రక్షణ’ (Rakshana) కావడం విశేషం ఇంకో విచిత్రం ఏంటి అంటే.. ఈ సినిమాల్లో వీరిద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించబోతున్నారు. అక్కడితో అయిపోలేదు.. ‘సత్య భామ’ ‘రక్షణ’ ఈ 2 సినిమాల కథలు మర్డర్ ఇన్వెస్టిగేషన్ పైనే నడుస్తాయట.
ఈ సినిమాల ట్రైలర్స్ చూస్తే… అవి నిజమే అన్నట్టు అనిపిస్తున్నాయి.నిజంగా ఒకే రోజు రిలీజ్ అవుతున్న వీరి సినిమాలు ఓకే కథతో వస్తే.. ప్రేక్షకులు ఏ సినిమాని యాక్సెప్ట్ చేస్తారు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే పోలీస్ స్టోరీలు చాలా వరకు ఒకటే పాయింట్ తో ఉంటాయి. స్క్రీన్ ప్లే బాగుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు.. లేదు అంటే రిజెక్ట్ చేస్తారు. మరి ఈ 2 సినిమాల్లో దేనికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి