‘ఆదర్శ కుటుంబం..'(Aadarsha Kutumbam AK 47) సినిమా క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ మేకర్స్ వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హీరో వెంకటేష్ ‘చిట్టిబాబు’ పాత్రని పరిచయం చేస్తూ ఓ ప్రోమో వదిలారు. అందులో వెంకటేష్ ‘ఐ యామ్ ది మేన్ ఆఫ్ ది హౌస్’ అని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఆకట్టుకుంది. ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకుంటున్నట్టు వెంకీ తన సిగ్నేచర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదుగా..!
అలాగే ప్రోమో చివర్లో మాత్రం ఓ ట్రైన్ సీక్వెన్స్‌ని స్పెషల్‌గా హైలైట్ చేశారు. వెంకటేష్‌తో పాటు హీరోయిన్, ఇద్దరు పిల్లలు రన్నింగ్ ట్రైన్ నుండి బయటకు చూస్తుండగా, వారి ముఖాలపై గాయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆసక్తికరంగా, ఆ తర్వాత వచ్చిన ప్రోమోస్‌లో కూడా ఇదే ట్రైన్ సీక్వెన్స్ మళ్లీ మళ్లీ కనిపించడంతో, సినిమా కథలో ఇది కీలక ఘట్టం అని మేకర్స్ పరోక్షంగా సూచిస్తున్నట్టు అర్థమవుతోంది. హీరో ఫ్యామిలీ ఏదో ఒక క్రైమ్‌లో ఇరుక్కుని, దాన్నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా రన్నింగ్ ట్రైన్ ఎక్కడం జరుగుతుందని అంతా భావిస్తున్నారు.
అలాగే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47′(ఏకే 47) కథాంశం విషయానికొస్తే, ఇది హాలీవుడ్ సిరీస్ ‘ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ’ నుండి కాపీ కొట్టిందని కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది అయితే ‘దృశ్యం’ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ‘బ్లాస్ట్’ వంటి సినిమాల మిక్స్‌గా దర్శకుడు గురూజీ దీన్ని తీర్చిదిద్దుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఈ ఊహాగానాల్లో నిజమెంతో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.