ఏవేవో రూమర్లు నిజమువుతాయి.. ఈ రూమర్ నిజమైతే బాగుండు.. అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కచ్చితంగా అనిపించే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ రూమర్ బయటకు వచ్చింది. ఎక్కడ, ఏ లీక్ వచ్చిందో తెలియదు కానీ.. తెలుగు సినిమా ఇంకా చెప్పాలంటే మొత్తం ఇండియన్ సినిమా హ్యాపీగా ఫీలయ్యే రోజు వచ్చేస్తోంది. క్యాలెండర్‌లో పేజీ మారక ముందే ఇది జరిగిపోవచ్చు అంటున్నారు. ఏంటీ ఎలివేషన్, ఏంటీ ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా? ఆ సినిమా స్థాయి అలాంటిది మరి.
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టిన సినిమా ‘బాహుబలి’. అప్పటికే మన సినిమాకు విదేశీ గడ్డ మీద పరిచయం ఉన్నా.. మన సినిమా కోసం వెతికి మరీ విదేశీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిన చిత్రంగా ‘బాహుబలి’ని చెప్పొచ్చు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని ఏళ్లుగా మరో మాట వినిపిస్తూ వచ్చింది. అదే ‘బాహుబలి 3’. అవును ఈ సినిమాకు మూడో పార్టు ఉంటుందని.. ఇటీవల ప్రభాస్, రానా, అనుష్క చెప్పేశారు. ఇప్పుడు ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారట.
‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సర్‌ప్రైజింగ్‌గా ‘బాహుబలి 3’ ఉంటుందని ప్రభాస్, రానా, అనుష్క అధికారికంగా చెప్పారు. ఇప్పుడీ సినిమాకు జులై 30 లేదా 31న కొబ్బరియాక కొట్టేలా రాజమౌళి అండ్ కో. ప్లాన్స్ వేస్తున్నారట. హైదరాబాద్‌లో సన్నిహితుల మధ్య ఆ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారట. అయితే మరి మీడియాకు అధికారికంగా సమాచారం ఇస్తారా లేక ‘వారణాసి’కి వాడిన స్ట్రాటజీ వాడతారా అనేది చూడాలి.
‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా ప్రచారం సమయంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘బాహుబలి 3’ తీయడానికి అవకాశం ఉందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పార్ట్ 3 తీస్తానని చెప్పారు. ‘వారణాసి’ తర్వాత ఊహించని ఇమేజ్‌తో దూసుకుపోయే రాజమౌళి ‘బాహుబలి 3’ సినిమా తీస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది అని చెప్పొచ్చు.