మాస్, క్లాస్ ని కలిపి కొట్టిన జై లవకుశ ఫస్ట్ లుక్
- May 19, 2017 / 10:09 AM ISTByFilmy Focus
నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న జై లవకుశ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరవనున్నారు. అందులో ఒక పాత్ర అయిన లవకుమార్ లుక్స్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఇందులో యంగ్ టైగర్ మీసం మెలితిప్పి, బ్లాక్ స్పెర్స్ పెట్టి క్లాస్, మాస్ ని కలిపి కొట్టారు. దమ్ము తర్వాత ఎన్టీఆర్ మీసం మెలితిప్పలేదు. పూర్తిగా క్లాస్ వైపు వెళ్లారు. మళ్ళీ ఇన్నేళ్లకి మాస్ కి విందు భోజనం చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఈ లుక్ స్పష్టం చేస్తోంది.
రెండో పోస్టర్ లో చేతులకు సంకెళ్లు ఉండడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రెండు పోస్టర్ లలో రావణాసురుని విగ్రహం ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














