సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత, నటుడు, సినీ విశ్లేషకులు అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు(Tripuraneni Chittibabu) గారు కొద్దిసేపటి క్రితం మరణించారు.ఆయన మరణవార్త తెలుగు సినీ పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అనే చెప్పాలి.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ – కొండాపూర్ మధ్యలో ఉన్న సింధు హాస్పిటల్‌లో చిట్టిబాబు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆయనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారట.
ఈ క్రమంలో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. చిట్టిబాబు గారు చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారని సమాచారం.త్రిపురనేని చిట్టిబాబు గారు కేవలం నిర్మాతగానే కాకుండా, సినిమాలపై లోతైన అవగాహన ఉన్న అనలిస్ట్‌గా కూడా చాలా మందికి సుపరిచితం. నిర్మాతగా.. ఆయన పలు అభిరుచి గల చిత్రాలను నిర్మించారు. కానీ అవి ఆయనకు డబ్బులైతే తెచ్చిపెట్టలేదు.
కానీ లోతైన విశ్లేషణ కలిగిన అనలిస్ట్ గా తరచూ ఇంటర్వ్యూల్లో కనిపిస్తూనే వచ్చారు. బాక్సాఫీస్ లెక్కలు, సినిమాలపై ఇచ్చే విశ్లేషణలు కరెక్ట్ గా ఉంటాయి. అలాగే పలు సినిమాల్లో ఆయన సహాయానటుడిగా కూడా కనిపించారు. ‘జిన్నా’ ‘జాతి రత్నాలు’ ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాల్లో చిట్టిబాబు నటించారు. ఇక చిట్టిబాబు మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తిని, సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న విశ్లేషకుడిని టాలీవుడ్ కోల్పోయిందని అభిప్రాయ్పాడుతున్నారు.
అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని దేవుడిని ప్రార్దిస్తున్నట్టు కూడా తెలిపారు.