తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన త్రిష

  • February 15, 2019 / 05:59 PM IST

మామూలు అమ్మాయిలకే తనకు కాబోయే భర్త గురించి బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది అమ్మాయిల్లో నెక్స్ట్ లెవల్ అమ్మాయిలైన హీరోయిన్లకు ఎలాంటి ఎక్స్ పెక్తేషన్స్ ఉంటాయి చెప్పండి. ఒక్కోసారి వాళ్ళు ఇంటర్వ్యూల్లో వాళ్ళకు కాబోయే భర్తలకు ఉండాల్సిన లక్షణాల వివరాలు చెబుతుంటే మైండ్ పాడైపోతుంటుంది. కానీ.. మన నేచురల్ బ్యూటీ త్రిషకి మాత్రం చాలా చిన్న కోరిక ఉంది. ఆమెకు కాబోయే భర్త పెద్దగా డబ్బులు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ మంచి మనసున్నవాడైతే చాలు అంటోంది త్రిష.

ఆఖరికి అబ్బాయి నల్లగా ఉన్నా పర్లేదు కానీ.. తన మునుపటి ఎక్స్ తరహాలో రెండు విధాలుగా ఆలోచించేవాడు మాత్రం కాకూడదు అని బలంగా చెప్పింది త్రిష. ఇక ఆమె కెరీర్ అయిపోయింది అని అందరూ అనుకొంటున్న తరుణంలో.. “96, పెట్ట” సినిమాలతో సూపర్ హిట్ కొట్టి త్రిష్ ఈజ్ బ్యాక్ అనిపించుకొంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు క్రేజీ ప్రొజెక్ట్స్ ఉన్నాయి. చాలా మంది సీనియర్ & యంగ్ హీరోస్ కూడా ఆమెతో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. త్రిష మాత్రం అస్సలు కంగారుపడకుండా తన పాత్రకు కాస్త వేల్యూ ఉన్న రోల్స్ మాత్రమే సెలక్ట్ చేసుకుంటుంది. ఇదే ఫార్మాట్ లో కంటిన్యూ అయితే అమ్మడు పెళ్లి చేసుకొనేవరకూ టాప్ లీగ్ లో కొనసాగడం పెద్ద విషయమేమీ కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus