త్రిష.. తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. తెలుగులో ఈమె స్ట్రెయిట్ మూవీ వర్షం అని చెప్పాలి. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యం.యస్.రాజు నిర్మించాడు. 2004 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. త్రిష కెరీర్ ప్రారంభించింది తమిళ సినిమాలతోనే అయినా..
ఆమెకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ తెలుగు సినిమానే కావడం విశేషం. వర్షం తర్వాత త్రిష కెరీర్ ఊపందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్ లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. త్రిష గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అదేంటి అంటే.. త్రిష కెరీర్ లో ఓ నటుడు చాలా ప్రత్యేకమట.
ఆ నటుడు త్రిషకు తండ్రిగా, మామగారుగా, బాయ్ ఫ్రెండ్ గా కూడా చేశాడట. ఆ నటుడు మరెవరో కాదు ప్రకాష్ రాజ్. వర్షం, ఆకాశమంత.. పొన్నియన్ సెల్వన్ – 1 వంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్.. త్రిషకి తండ్రిగా నటించాడు. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ఈమెకు మామగారు పాత్ర పోషించాడు. ఇక గిల్లి(ఒక్కడు తమిళ్ రీమేక్) లో త్రిషకి ప్రియుడు పాత్రను పోషించాడు ప్రకాష్ రాజ్. ఆ రకంగా త్రిష.. ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ చాలా వైవిద్యమైనదన్న మాట.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?