రెండేళ్ల క్రితం ఆగిపోయిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారు

బాలీవుడ్‌లో అనుష్క శర్మ నటించిన ‘ఎన్‌హెచ్‌ 10’ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రాన్ని తమిళంలో ‘గర్జనై’ పేరుతో రీమేక్‌ చేసేందుకు అప్పట్లో సన్నాహాలు జరిగాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ కూడా విడుదలయ్యాక.. ఆ ప్రొజెక్ట్ ఏమైందో ఎవరికీ తెలియకుండాపోయింది. సుందర్‌ బాలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి తమిళనాట జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పుడే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండేది.

అప్పుడు పీపుల్‌ ఆఫ్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(పెటా) కు మద్దతుగా త్రిష వ్యవహరించడంతో ఈ సినిమా చిత్రీకరణను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొన్నిరోజుల పాటు చిత్రీకరణ కూడా ఆగిపోయింది. చివరకు షూటింగ్‌ పూర్తయినా సినిమా మాత్రం విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదల హక్కులను ఎస్‌టీసీ ఫిక్చర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. త్వరలో విడుదల చేయబోతుంది.

ఆ సినిమా కథ-కథనంతోపాటు త్రిష క్యారెక్టర్ కూడా బాగున్నప్పటికీ.. మరీ ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా విడుదలవ్వడం త్రిష కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోగా.. మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి త్రిష కాస్త స్పందించి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకొంటుందో లేక ఎప్పట్లానే లైట్ తీసుకొంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus