Trisha: విదేశీ పర్యటనలో కాలి ప్రమాదానికి గురైన నటి త్రిష?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి త్రిష గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఇప్పటికీ అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నారు. తాజాగా ఈమె లెజెంరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఈమె కుందవై పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిషకు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సరసన అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయడం కోసం ఈమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ విధంగా ఫారెన్ వెకేషన్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి త్రిషకు అనుకోకుండా ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలోనే తన కాలికి గాయం కావడంతో ఈమె తన వెకేషన్ మధ్యలోనే తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఇలా తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఫారెన్ వెకేషన్ లో తన కాలికి ప్రమాదం జరగడంతో మధ్యలోనే వెనుతిరిగి ఇండియా వచ్చేసానని

ఈమె తన కాలికి బెల్ట్ వేసినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు త్వరగా తిరిగి కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus