Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Advertisement

కోలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్లలో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసొచ్చినా.. రెండు పదుల ఏళ్ల కెరీర్‌ ఉననా.. ఇప్పటికీ ఆమె స్టార్‌ హీరోయినే. అంతేకాదు ఆమె స్టార్‌ హీరోలకు ఇప్పటికీ లక్కీ ఛార్మ్‌. రీసెంట్‌ సినిమా ‘కరుప్పు’ భారీ విజయం సాధించడంతో ఆమెను మరోసారి లక్కీ ఛార్మ్‌ అంటూ ఫ్యాన్స్‌ పొగిడేస్తున్నారు. ఓ అభిమాని ఇదే మాట అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేయగా.. దానిని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్‌ వైరల్ అవుతోంది.

Trisha

తమిళ చిత్ర పరిశ్రమ అగ్ర హీరోలు అంటే అజిత్‌, విజయ్‌, సూర్య అంటూ రాయడం స్టార్ట్ చేస్తారు. ఈ పేర్ల వరుస కాదు ఇక్కడ ముఖ్యం. ఆ పేర్లు ముఖ్యం. ఈ ముగ్గురికీ రీసెంట్‌గా హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌ అంటే.. త్రిష అనే చెప్పాలి. ఆమెతో కలసి పని చేసిన ఆ హీరోల సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఆ విషయాన్నే ఓ అభిమాని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. వారి బ్లాక్‌బస్టర్‌ వెనక.. త్రిష మ్యాజిక్‌ ఉందని ఆ పోస్టులో రాసుకొచ్చాడు ఆ అభిమాని.

‘లియో’ సినిమా విజయ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. 2023లో వచ్చిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. అజిత్ కుమార్ లైఫ్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. 2025లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.248 కోట్లకు పైగా వసూలు చేసిందా సినిమా. ‘కరుప్పు’ సినిమాతో స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు సూర్య. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్ల దిశగా వెళ్తోంది.

ఈ మూడు సినిమాల్లో త్రిషనే హీరోయిన్‌. ఈ మూడు సినిమాల వసూళ్లు కలిపితే రూ.1200 కోట్లు అవుతోంది. ఇక ఇప్పుడు లక్కీ ఛార్మ్‌ ప్రభావం తెలుగు పరిశ్రమకు కూడా దక్కుతుందేమో చూడాలి. త్రిష నెక్స్ట్‌ సినిమా చిరంజీవి ‘విశ్వంభర’ అనే విషయం తెలిసిందే.

ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus