మహేష్ బాబుపై ప్రేమ కురిపించిన త్రిష

  • October 25, 2016 / 09:06 AM IST

అందాల భామ త్రిష తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో నటించి హిట్ అందుకుంది. వ‌ర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా,’ ‘అత‌డు,’ ‘పౌర్ణ‌మి,’ ‘స్టాలిన్,’ ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే,’ ‘కృష్ణ‌,’ ‘న‌మో వేంక‌టేశ’ తదితర సినిమాల్లో అందం అభినయం తో ఆకట్టుకుంది. ప్రస్తుతం టైటిల్ రోల్ పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. కొంతకాలం నాయకి గా వచ్చిన త్రిష.. ఇప్పుడు “మోహిని”గా థ్రిల్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పింది. ఫుడ్ లో ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని, ప్రియాంక చోప్రా కి ఫ్యాన్ అని చెప్పిన ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. “ప్రిన్స్ పక్కా ప్రొఫిషనల్. నా స్వీట్ సూపర్ స్టార్” అంటూ ప్రేమ కురిపించింది. ఈమె అతడు చిత్రంలో పల్లెటూరి పిల్లగా మహేష్ సరసన జోడీగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరూ సైనికుడు మూవీలో ఆడిపాడారు. ఇక వర్షం, పౌర్ణమి లో కలిసినటించిన ప్రభాస్ గురించి అయన అభిమానులు అడిగితే “పరిశ్రమలోని నిజమైన డార్లింగ్” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తీన్ మార్ చిత్రంలో రొమాన్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే “యూనిక్ (ప్రత్యేక మైన వ్యక్తి)” అంటూ వివరించింది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus