త్రివిక్ర ‘మార్కు’డు!!!

  • April 19, 2016 / 01:49 PM IST

బుల్లెట్ అర అంగుళమే ఉంటుంది, కానీ ఆరు అడుగుల మనిషిని ఛంపుతుంది. మరి అలాంటి బుల్లెట్ ఆరడుగులు ఉంటే!!! ఈ డైలాగ్ ఎవరైన మరచిపోగలరా…పవర్ స్టార్ పవన్ ను దృష్టిలో పెట్టుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్నులోనుంచి జాలు వారిన పదాల బుల్లెట్ ఇది. ప్రస్తుత సినీ పరిశ్రమ పరిస్థితుల్లో సినిమా హిట్ కావాలంటే పెద్ద హీరో ఉండాలి, అందమైన హీరోయిన్ కావాలి, మంచి పాటలు ఖచ్చితంగా ఉండి తీరాలి, ఇంకా చెప్పాలి అంటే నాలుగైదు ఫైటింగ్స్ తప్పక నడవాలి, ఇవన్నీ చాలదు అనుకుంటే, రెండు సుమోలో…లేకపోతే నాలుగు స్కార్‌పీయోలో గాల్లోకి లేవాలి…ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి. కానీ అవేమి అవసరం లేకుండా…కధ ఎటువంటిదైనా తన కధనంతో కట్టి పడేస్తాడు….పదాలతో ‘జల్సా’ చేస్తూనే తన డైలాగ్స్ తో ఎమోషన్స్ పుట్టించేస్తాడు…మాటల్లోని తన ‘ఖలేజా’తో ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేస్తాడు…చెప్పాలనుకున్న భావాలను తన మాటలతో అవలీలగా పలికించేస్తాడు…ఇంకా చెప్పాలి అంటే ఆయన రాత ఎలా ఉంటుంది అంటే…కధ – కధనం – డైలాగ్స్ అన్నీ చిన్న పిల్లలు అక్షరాలు పేర్చి, పధాలు కూర్చినంత పొందికగా, ఆడ పిల్లలు ముగ్గులేసినంత అందంగా, ఆయన మాటలో చెప్పాలంటే గులాబీ మొక్కకు అంటూ కడుతున్నట్లు…శ్రద్దగా, పద్దతిగా ఉంటాయి. సన్నివేశానికి తగ్గట్లు మాటలే కాదు, అందులోని భావాన్ని కూడా కలగలిపి ప్రేక్షకులపై తన మదిలో మెదిలిన ఆలోచనలను సందిస్తాడు మన త్రివిక్రముడు..మరి అలాంటి ఆలోచనలకు అద్దం పట్టే కొన్ని డైలాగ్స్ ను మనసుతో ఒక్కసారి తిరగేద్దాం రండి…

బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం….బాగున్న వాడిని ఎలా ఉన్నావ్ అని అడగడం అనవసరం…

వయసు అయిపోయిన హీరోలందరు రాజకీయ నాయకులు అయిపోయినట్లు…ఫెయిల్ అయిపోయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్ కాలేరు…

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్…

అందంగా ఉండడం అంటే మనకు నచ్చేట్లు ఉండడం కానీ, ఎదుటివారికి నచ్చేలా ఉండడం కాదు….

అద్భుతం జరిగేప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు…జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు…

తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడి జీవితంలో పైకి రాలేడు….

కారణం లేని కోపం…ఇష్టం లేని గౌరవం…భాద్యత లేని యవ్వనం…జ్ఞాపకం లేని వృధ్యాప్యం అనవసరం…

యుద్దంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు…ఓడించడం…

సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు…చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు…

మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి కానీ, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు…

పలావ్ మిగిలిపోతే పాలేరులు తింటారు సార్..కానీ ఆడపిల్ల పుట్టినింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus