Trivikram: పవన్ సినిమాలతో భారీగా సంపాదిస్తున్న త్రివిక్రమ్!

  • July 22, 2023 / 12:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో కూడా ఎంతో బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలకు వివిధ డైరెక్టర్లు పనిచేసినప్పటికీ ఆ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ హస్తం ఉండే ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ రీమేక్ సినిమాలను తెలుగు వర్షన్ కి అనుగుణంగా మార్చడం కోసం త్రివిక్రమ్ పనిచేస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు (Trivikram) త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక పర్యవేక్షకుడిగా పనిచేస్తూ భారీగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో వంటి సినిమాలకు త్రివిక్రమ్ దర్శక పర్యవేక్షకుడిగా పని చేశారు. ఇలా పవన్ సినిమాల కోసం త్రివిక్రమ్ పనిచేయడానికి కారణం పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్నటువంటి స్నేహం అని మాత్రమే చెప్పాలి.

ఇలా పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా ఉన్నటువంటి త్రివిక్రమ్ పవన్ సినిమాలన్నింటికీ కూడా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నారు. అయితే ఇలా పవన్ సినిమాలకు పనిచేయడం కోసం త్రివిక్రమ్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సాధారణంగా త్రివిక్రమ్ ఒక సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ సుమారు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారు.

అయితే ఈయన పవన్ సినిమాలకు కనుక పనిచేస్తే ఏకంగా 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా పవన్ తో స్నేహం కారణంగా త్రివిక్రమ్ కోట్ల రూపాయల ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus