త్రివిక్రమ్, నితిన్ లాంచ్ చేసిన “జయమ్ము నిశ్చయమ్మురా” ఫస్ట్ లుక్!!

  • February 16, 2016 / 12:06 PM IST

శ్రీనివాస్ రెడ్డి,పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రముఖ హీరో నితిన్ లాంచ్ చేసారు. వీడియో పోస్టర్ చాల కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. “జయమ్ము నిశ్చయమ్మురా” టీమ్ కు నితిన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. త్రివిక్రమ్ గారి లాంటి గ్రేట్ డైరెక్టర్ “జయమ్ము నిశ్చయమ్మురా” వీడియో పోస్టర్ పై ప్రశంసలు కురిపించటం చాల  స్పూర్తినిస్తోందని దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు. వంశీగారు, భాగ్యరాజా గారు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో “జయమ్ము నిశ్చయమ్మురా” అలా ఉంటుందని చిత్ర కధానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్. రాజు, ఈ చిత్రం లో ఓ ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ ఈ చిత్రానికి  రచనా సహకారం అందించి, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న పరమ్ సూర్యాన్షు తదితరులు పాల్గొన్నారు.  90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని “మే” లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus