‘ఎన్టీఆర్ 30’ పై త్రివిక్రమ్ ఫోకస్ చెయ్యడం లేదా?

  • June 10, 2020 / 01:50 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పూర్తైన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు నిర్మాతలు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ బిజినెస్ మెన్ గా అలాగే యంగ్ పొలిటీషియన్ గా కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతుంది. ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ .. మాత్రం ఇంకా స్క్రిప్ట్ ను కంప్లీట్ చేయలేదట. ఇటీవల ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ ను కలిసి స్క్రిప్ట్ స్టేటస్ గురించి అడుగగా.. సగం స్క్రిప్ట్ ను వివరించాడట త్రివిక్రమ్.

దీంతో త్వరగా పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చెయ్యమని ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ను కోరినట్టు తెలుస్తుంది. ఈ వార్త ఇలా బయటకు రాగానే.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఇప్పట్లో పూర్తవ్వదు అని భావించి త్రివిక్రమ్ ఇలా స్లోగా ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేసేలా చేస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ఓ పక్క ‘ఎన్టీఆర్30’ సినిమా స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తూనే మరోపక్క వెంకటేష్,నాని లతో మల్టీ స్టారర్ కూడా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా త్రివిక్రమ్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇతని టీమంతా ఈ రెండు సినిమాల స్క్రిప్ట్ ల పై సైమల్టేనియస్ గా వర్క్ చేస్తున్నట్టు సమాచారం.అందుకే ‘ఎన్టీఆర్ 30’ స్క్రిప్ట్ వర్క్ స్లోగా సాగుతుందట. ఇక ‘ఎన్టీఆర్ 30’ ప్రాజెక్ట్ ను ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్దే ను ఫైనల్ చేసినట్టు కూడా టాక్ నడుస్తుంది కానీ ఇంకా నిర్మాతలు కన్ఫార్మ్ చెయ్యలేదు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus