త్రివిక్రమ్ రచనలో – అద్భుతమైన పాత్రలు

  • October 4, 2016 / 01:08 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన కాలం నుంచి జాలు వారిన డైలాగ్స్, ఇక ఆయన రాసిన పాత్రలు. అసలైతే త్రివిక్రమ్ సినిమాలో హీరో కన్నా, పాత్రల కన్నా, ఆయన మాటలే ఎక్కువగా మాట్లాడతాయి. కధా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన త్రివిక్రమ్ దర్శకుడుగా సైతం కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఇక అందులో బ్లాక్ బష్టర్ హిట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన కొన్ని అద్భుతమైన, మరువలేని పాత్రలు కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

‘బంకు’ – ‘మన్మధుడు’లో సునీల్ పాత్ర

నాన్నా నేను బంకు…పెళ్లి కూతురు జంపు అంటూ గోదావరి జిల్లాల్ల వెటకారాన్ని మొత్తం సునీల్ రూపంలో సంధించాడు మన మాటల మాంత్రీకుడు.

‘పండు’ – ‘నువ్వే నువ్వే’ లో సునీల్ పాత్ర

నాలాంటి ఒక్కాన్ని కనడానికే చిరాగ్గా ఉంటుంది అలాంటి ఇద్దరిని ఎవరైనా కంట్టార్రా అంటూ నవ్వించే పాత్ర ఇది..ప్రతీ ఒక్కరికీ పండు లాంటి స్నేహితుడు ఉంటాడు. ఒకవేళ లేకపోయినా, ఈ పాత్ర చూసిన తరువాత ఉంటే బావుంటుంది అని అనిపిస్తుంది.

‘సుజాత’ – నువ్వు నాకు నచ్చవ్ లో సుహాసిని పాత్ర

తెలుగు ఆడపిల్లల నిస్సహయ జీవితానికి నిదర్శనం ఈ పాత్ర. తన మేనకోడాలి దుస్థితిని చూసి నిస్సహాయంగా ఏమీ చెయ్యలేక హీరోని నిలదీసే పాత్ర.

బుజ్జి – ‘అతడు’ లో బ్రహ్మాజీ పాత్ర 

“రేయ్ మా బావను కొట్టడం కాదు బుజ్జిని కొట్టు, నేనే నాగసముద్రం బుజ్జి” అంటూ పల్లెటూరిలోనే అమాయకత్వాన్ని, అదే క్రమంలో అంతులేని అహన్ని సైతం చూపించే పాత్ర.

‘దామోదర్ రెడ్డి’ – ముకేశ్ రుషి

పెద్దరాయుడుగా మారిన ఫ్యాక్‌షన్ లీడర్ ఇలానే ఉంటాడేమొ. తన సీమ పోరుషాన్ని చూపించే క్రమంలో ‘నాకు డబ్బు అంటే అవసరం అప్పా, ఇష్టం కాదు’ అంటూ ఆ మాటలోని గాంభీర్యాన్ని చూపించే పాత్ర.

‘లవంగం’ – మన్మధుడు లో బ్రహ్మీ పాత్ర.

‘తెలివిగల వాడిలాగా నటించే అమాయకపు పాత్ర’. తన లవ్ స్టోరీ గురించి చెప్పే క్రమంలో ‘ముందు తాను నన్ను ప్రేమించింది, ఆతరువాత నేను ఆమెను ప్రేమించాల్సి వచ్చింది’ అంటూ తన అమాయకత్వాన్ని అతితెలివిగా తెలియజేసే పాత్ర ఇది.

ధనుష్ కోటి – ‘జైచిరంజీవ’లో సునీల్ పాత్ర

అమాయకత్వానికి అర్ధం ఏంటి అంటే ఈ పాత్ర చూపించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అమాయకత్వానికి 90 కేజీల కార్బన్ కాపీ ఈ పాత్ర.

‘విశ్వనాధ్’ – నువ్వే నువ్వే లో తండ్రి పాత్ర

తన కన్న కూతురుకే అన్నీ తానే అనుకునే పాత్ర. తాను ప్రేమించే అంతగా కూతుర్ని ఇంక ఎవ్వరూ ప్రేమించలేరు…ప్రేమించకూడదు అనే స్వార్ధంతో కూడిన ప్రేమ కలిగిన పాత్ర.

‘బిట్టు’ – ‘జులాయి’లో సోనూ సూద్ పాత్ర

అహంకారానికి ఆరడుగుల ప్రతిరూపం ఈ పాత్ర. ‘మనకు వచ్చిన పని ఫ్రీగా చెయ్యకూడదు, రానిపని ట్రై చెయ్యకూడదు’ అంటూ తనలోని పొగారుణి బయట పెట్టే పాత్ర.

దేవరాజ్ నాయుడు – ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’లో ఉపెంధ్ర పాత్ర

మనిషి రూపంలో ఉన్న మృగం ఈ పాత్ర. మృగం ముసుగులో ఉన్న మంచితనం ఈ పాత్ర.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus