Trivikram, Suriya: సూర్య- త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. మరి పవన్ సంగతేంటి?

‘త్రివిక్రమ్ తో పలనా హీరో సినిమా’ అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. నిజానికి అధికారిక ప్రకటన వచ్చినా ఆ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్తాయన్న గ్యారెంటీ లేదు. ‘అజ్ఞాతవాసి’ సినిమా టైంలోనే వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు అనౌన్స్ చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత ‘త్రివిక్రమ్ తో నా సినిమా’ అంటూ చిరు.. ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ లో అనౌన్స్ చేశారు.

ఆ ప్రాజెక్టుని ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసే లేదు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు సూర్యతో.. త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఈ కాంబో సెట్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు.

ఇక ఇప్పుడు మహేష్ తో సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్.. సూర్యతో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య కోసం త్రివిక్రమ్ కథ కూడా రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సూర్య తెలుగు దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బోయపాటి శ్రీను తో ఆయన సినిమా దాదాపు ఖరారు అయిపోయింది. కానీ త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకోవడం అంత ఈజీ ఏమి కాదు. టాలీవుడ్లో త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. మహేష్ తో సినిమా పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్, రామ్, అల్లు అర్జున్,వెంకటేష్ వంటి హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేయాల్సి ఉంది. కాబట్టి సూర్య- త్రివిక్రమ్ ల కాంబో సెట్ అవ్వడం ఇప్పట్లో అసాధ్యమనే చెప్పాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus