త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ పేరు బ్రాండ్ గా మరి కొన్ని ఏళ్లు అయ్యాయి. ఆయన సినిమాలు అనగానే స్వచ్ఛమైన కామెడీ, పదునైన మాటలు, కమ్మనైన కథ ఉంటాయని ప్రేక్షకుల్లో ఓ ముద్ర పడిపోయింది. పైగా మాటల మాంత్రికుడి చిత్రాలను కుటుంబ సమేతంగా వీక్షించవచ్చనేది అందరీ మాట.
అందుకే అటువంటి చిత్రాలను మరిన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఆయన నిర్మాతగా మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మహిళా డైరక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నితిన్ హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఇక రెండో మూవీని యువ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేయనుండడం ఖరారు అయింది.
మూడో చిత్రానికి కథ రెడీ అయింది. అయితే ఈ ఫిల్మ్ ద్వారా కొత్త దర్శకుడిని పరిశ్రమకు పరిచయం చేయాలని త్రివిక్రమ్ అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. తాను ఎదగడమే కాకుండా.. ఎదిగేందుకు మరికొంతమందికి అవకాశం ఇస్తున్నందుకు త్రివిక్రమ్ పై సినీజనాల్లో గౌరవం మరింత పెరిగింది.